జిల్లాలో పోషణ మాసం సందర్భంగా ప్రత్యేక కార్యచరణ అమలు : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలో సెప్టెంబర్ పోషణ మాసం సందర్భంగా ప్రత్యేక కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పోషణ మాసం పురస్కరించుకొని జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటిలో గల సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ లో చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం, గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమంలో సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియా జి.ఎం. దేవేందర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమతుల్యమైన పౌష్టికాహారాన్ని అందించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. పోషకాహార లోపం కారణంగా చిన్నపిల్లలలో ఆటంకం ఏర్పడుతుందని, గర్భిణులలో పోషకాహారలేమితో తక్కువ బరువు ఉన్న పిల్లలు జన్మిస్తారని తెలిపారు. బాలింతలు, కిశోర బాలికలలో రక్తహీనత లోపం తగ్గించడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార కార్యక్రమాన్ని పోషణ్‌ అభియాన్‌ గా సెప్టెంబర్ మాసాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అంగన్ వాడి టీచర్లు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు వారి పరిధిలోని ఇండ్లను సందర్శించి రక్తహీనతతో బాధపడుతున్న చిన్నపిల్లలు, కిశోర బాలికలు, నవజాత శిశువులను సంతులిత ఆహారం తీసుకునేలా అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్న భోజనం అందిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కిశోర బాలికలకు ఆరోగ్య సంబంధ అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడి ఆరోగ్య, ఆశ కార్యకర్తలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

 

Share This Post