జిల్లాలో ప్రతి జి.పి.నుండి కనీసం 200 మంది ఉపాధిహామీ పనులకు వచ్చేట్లు అధికారులు కృషి చేయాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

జిల్లాలో ప్రతి జి.పి.నుండి కనీసం 200 మంది ఉపాధిహామీ పనులకు వచ్చేట్లు అధికారులు కృషి చేయాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

జిల్లాలో ప్రతి జి.పి.నుండి కనీసం 200 మంది ఉపాధిహామీ పనులకు వచ్చేట్లు అధికారులు కృషి చేయాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, ఏప్రిల్ -29:

జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ నుండి కనీసం 200 మంది కూలీలు ఉపాధిహామీ పనులకు వచ్చేట్లు అధికారులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎంపిడిఓ లను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి జిల్లాలోని ఎంపిడిఓ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి NREGS., హారితహారం, సి.ఎం. గిరివికాస్ పథకం, పారిశుధ్యం, తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, NREGS ద్వారా జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ నుండి కనీసం 200 మంది జాతీయ ఉపాధి హామీ పనులకు వచ్చే విధంగా సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని, లేబర్ మొబలైజేషన్ అనేది ప్రధానమని, జిల్లా సగటు 92 వేల మంది ఉండగా 69 వేల మంది మాత్రమే కూలీలు ఉపాధి హామీ పనులకు వస్తున్నారని, లేబర్ బడ్జెట్ అచివ్ మెంట్ 62% కన్నా చాలా తక్కువగా ఉన్న 6 మండలాలల్లో ఎంపిడిఓ లు బాధ్యత వహించి, లేబర్ సమస్య లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్ ఆవరేజ్ రేటును అధిగమించాలని తెలిపారు.

పనికి ముందు పని తర్వాత ఫోటో తీయాలని, కూలీలు సమయాభావం పాటించేలా చూడాలని, ఉదయం 7-30 గంటలకు నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గoటల నుండి 7 గంటల వరకు రెండు షిఫ్ట్ లను రెండు ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం ఎంచుకొని, పని జరుగు సమయాన్ని నిర్దేశించి, కూలీలు అందరూ వచ్చేటట్లు చూడాలని, అయా గ్రామాల కార్యదర్శులు, సర్పంచులతో సమీక్షించి ట్రాలీ ఆటో ట్రాక్టర్ లో వారిని పని జరిగే ప్రదేశాలకు పంపాలని,

ఎఫ్ టి ఓ, ఎం సి సి ఆపరేటర్స్ నిర్లక్ష్యం వహించకుండా సరైన సమయానికి వెంటనే అప్లోడ్ చేయాలని, 4,5 పారామీటర్స్ వృద్దిచెందే విధంగా, ఉండేట్లు చూసుకోవాలని, ఆవరేజ్ కంటే తక్కువగా ఉంటుంటే మెటీరియల్ కాంపొజిషన్ వచ్చే అవకాశం ఉండదని, జిల్లాలో 257 రూపాయల లక్ష్యం తో పని చేయించుకోవాలని, లేబర్ బడ్జెట్ అచివ్ మెంట్ మన పనితనాన్ని గుర్తిస్తుoదని, రియలైజేషన్ రిపోర్టు తక్కువగా ఉంటే ఏ పి ఓ లదే భాద్యత అని అవరేజ్ కన్నా తక్కువగా ఉన్న మండలాల ఏపీవో లపై తగు చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఓ ను ఆదేశించారు.

మే నెలలో హరితహారం ప్రిపరేషన్ చేసుకొని జూన్ లో వర్షాలు పడిన తర్వాత ప్లాంటింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు. అంతకు ముందు నాటిన మొక్కలకు మూడు సార్లు వాటరింగ్ చేయాలని, shadenets ఏర్పాటుచేసి నర్సరీలలో పెరుగుతున్న మొక్కలను సంరక్షించుకోవాలి అని, పంచాయతీ సెక్రటరీ ల ద్వారా డిమాండ్ సర్వే చేయించాలని తెలిపారు. జూన్ 15 లోగా ప్లాంటింగ్కు అనువుగా వున్న మొక్కల వివరాలను అందించాలని తెలిపారు. వెరైటీ లను ముందుగా ప్లాన్ చేసుకొని పెంచాలని తెలిపారు.

ఇంతకు ముందు ప్లాంటింగ్ చేయని ప్రాంతాలను గుర్తించాలని తెలిపారు. 2023, 2024 కు సంబంధించి టాల్ ప్లాంట్స్ కావాలంటే ఇప్పుడే దృష్టి పెట్టాలని తెలిపారు.

గిరివికాసం లో త్రీ ఫేస్ కనెక్షన్ కొరకు వచ్చిన దరఖాస్తులను పంపాలని, ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉండి మహబూబాబాద్ నుండి దరఖాస్తులు తక్కువగా వచ్చాయని, వీటిపై దృష్టి పెట్టాలని తెలిపారు.

అనంతరం అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ పారిశుధ్యం, విద్యుత్, ట్రాక్టర్ ఛార్జీలు చార్జెస్ పై సమీక్షించారు. హరిత హారంలో ఏ రకమైన ప్లాంట్ ఎక్కడ పెట్టాలో ఆక్షన్ ప్లాన్ రూపొందించుకొని సిద్ధంగా ఉండాలని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, డి.పి. ఓ. సాయిబాబా, డిప్యూటీ సి. ఈ. ఓ. నర్మద, డి.ఎల్.పి. ఓ లు, ఎంపిడిఓ లు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post