జిల్లాలో నిమోనియా నివారించే దిశగా ప్రతి బుధ, శనివారాలలో నియోకోకల్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మధునూదన్‌నాయక్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా॥ నుబ్బారాయుడుతో కలిని జిల్లా అధికారులు, వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా స్రీ, శిశు నంక్షేమశాఖ, జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో టాస్క్ ఫోర్స్ నమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆనుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ఉప కేంద్రాలలో ప్రతి బుధవారం, గ్రామాలలో ప్రతి శనివారం వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంతకు ముందు ఈ వ్యాక్సిన్ ఖరీదు 2 వేల 800 రూపాయలు ఒక్క మోతాదు చెల్లించాల్సి వచ్చేదని, రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిన్తుందని, ఒక నెల 15 రోజులు, 8 నెలల 15 రోజుల వయన్సు గల పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి నష్టం జరుగదని, వ్యాక్సిన్ ప్రయోజనంపై ఆశలు, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు ప్రతి పట్టణము, వార్డులు, గ్రామాలలో ప్రజలందరికీ తెలిసేలా వినత (ప్రచారం చేయాలని, ఈ కార్యక్రమంలో వార్డు నభ్యులు, గ్రామ నర్చంచ్‌లు ప్రత్యేక చొరవ తీనుకొని విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డా ఫయాజ్, ప్రభుత్వ ఆనుషత్రి పర్యవేక్షకులు అరవింద్, సి.డి.పి.ఓ.
హేమసత్య, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, ప్రోగ్రామ్ అధికారులు డా॥ నీరజ, డా॥ అనిత, డా॥ విజయపూర్ణిమ, (డగ్ ఇన్స్‌పెక్టర్ నంతోష్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాన్, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.