ప్రచురణార్థం
ప్రతి మహిళకు బతుకమ్మ చీరె అందాలి…
జనగామ సెప్టెంబర్ 22. జిల్లాలో ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందజేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నియోజకవర్గ అధికారులు జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 12 మండలాలు మున్సిపాలిటీ పరిధిలో రెండు లక్షల 9,513 మంది ఉన్నారని ప్రతి ఒక్కరికి ప్రణాళిక బద్ధంగా సకాలంలో బతుకమ్మ చీర అందజేయాలని అధికారులను ఆదేశించారు.
అందుకు పక్క ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో 90 417 జనగామ నియోజకవర్గంలో 66 530 పాలకుర్తి నియోజకవర్గం లో 52 566 చీరలు పంపిణీ చేయనున్నామన్నారు.
మండల స్థాయిలో ఎంపీడీవోలు, గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీలు పర్యవేక్షించాలన్నారు. ఈనెల 24వ తేదీలోగా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. పంపిణీ అనంతరం పంపిణీ పూర్తి అయినట్లు నివేదిక అందజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ జెడ్పి సీఈవో విజయలక్ష్మి డి ఆర్ డి.ఏ. పీడి రామ్ రెడ్డి ఆర్డీవోలు మధుమోహన్ కృష్ణవేణి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.