జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలలో పూర్తి స్థాయిలో కోవిడ్-19 రక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని, తల్లిదండ్రులు అపోహలను విడనాడి తమ పిల్లలను పాఠశాలలకు పంపాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 02, ఖమ్మం:

జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలలో పూర్తి స్థాయిలో కోవిడ్-19 రక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని, తల్లిదండ్రులు అపోహలను విడనాడి తమ పిల్లలను పాఠశాలలకు పంపాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు. గురువారం వైరా పట్టణంలోని గురుకుల బాలికల విద్యాలయం అదేవిధంగా గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఇటీవలే పాఠశాలలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయి వైద్యాధికారుల బృంధం పర్యటించి పాజిటీవ్ వచ్చిన విద్యార్థులను హోమ్ ఐసోలేషన్లో ఉంచే విధంగా తగు చర్యలు తీసుకున్నామని దీనితో పాటు మున్సిపల్ సిబ్బందితో ప్రతిరోజు శానిటేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా చేపడ్తున్నామని కలెక్టర్ తెలిపారు. పాజిటీవ్ నమోదైన విద్యార్థులు హోమ్ ఐసోలేషన్ అనంతరం తిరిగి తరగతులకు హాజరవుచున్నారని, పాఠశాలలకు వచ్చే విద్యార్థినీలకు పాఠశాల ప్రాంగణంలో టెస్టులు నిర్వహించేలా తగు ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను, పాఠశాల ప్రిన్సిపలును, కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు రెసిడెన్షియల్ విద్యాలయాల్లోనే సురక్షితంగా ఉంటారని, తరచు ఏదో ఒక నెపంతో ఇండ్లకు తీసుకువెళ్లరాదని కలెక్టర్ తెలిపారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు కూడా ప్రజలను భయభ్రాంతులను చేసే విధంగా పాజిటీవ్ కేసుల వార్తలను ప్రచారం ప్రసారం చేయరాదని, వాస్తవాలను మాత్రమే తెలియజేయాలని ఈ సందర్భంగా మీడియా వారికి కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. అంతకుముందు వైరా పట్టణంలో 89 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనుల పురోగతిని, అదేవిధంగావైరాపట్టణంలో ఏర్పాటు చేయనున్న సమీకృత వెజ్, నాన్-వెజ్ మార్కెట్ ప్రదేశాన్ని కలెక్టర్. పరిశీలించారు. ఇప్పటికే ముగింపు దశలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను త్వరగా పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గురుకుల బాలికల విద్యాలయంలో నిర్మాణంలో ఉన్న అదనపు వసతి, తరగతి గదుల భవన నిర్మాణ పనులను కలెక్టర్ తణిఖీ చేసారు. చాలా కాలం నుండి నిర్మాణం ఆగిపోవడం వల్ల సంబంధిత కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకొని నిర్మాణపు పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు జి. వి. చంద్రమౌళి, మండల ప్రత్యేక అధికారి కె. సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రంజిత్ కుమార్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నాగషేషు, తహశీల్దారు, ఎం.పి.డి.ఓ సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post