జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు

పదో తరగతి పరీక్షలుశనివారం తో ముగిశాయి. పది పరీక్షలు ప్రారంభమైనప్పటి నుండి జిల్లా కలెక్టర్ తో పాటు అధికార యంత్రాంగం పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించడం పకడ్బందీగా నిర్వహించడంతో జిల్లా వ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిశాయి.
ఈ నెల 23న పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి రోజు శనివారం జరిగిన సోషల్ పేపర్‌ పరీక్షకు 11060 మంది విద్యార్థులకు గాను 10918 మంది విద్యార్థులు హాజరయ్యారు. 143 మంది గైర్హాజరయ్యారు.
98.70% నమోదయిందని డీఈవో గోవిందరాజు తెలిపారు.
పరీక్షలు ప్రారంభమైనప్పటి నుండి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్,
ఆర్జేడీ విజయలక్ష్మి, డీఈఓ గోవిందరాజులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజ శేఖర్ రావు, నూడల్ అధికారి కుర్మయ్య జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి, మండల విద్యాధికారులు శంకర్ నాయక్, చంద్రుడు నాయక్, భాస్కర్ రెడ్డి లు ఫ్లయింగ్ స్క్వాడ్‌ బృందాలతో కలిపి మొత్తం 189 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
జిల్లాలో ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అన్ని శాఖలను సమన్వయం పరుస్తూ…
స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి విద్యా శాఖ తరపున డీఈవో కృతజ్ఞతలు తెలిపారు.
పరీక్ష విధుల్లో పోలీసు, వైద్య ఆరోగ్య, రెవిన్యూ, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులకు మరియు విధులు నిర్వహించిన చీప్ సూపరిండెంట్ లు డిపార్ట్మెంట్ అధికారులు ఇన్విజిలేటర్లు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ఎప్పటికప్పుడు కవరేజ్ చేసిన మీడియాకు నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share This Post