జిల్లాలో ఫ్రీడం కప్ క్రీడలు విజయవంతం – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి

స్వతంత్ర భారత వజ్రో త్సవ వేడుకల సందర్భంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఫ్రీడం కప్ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు నాగర్ కర్నూలు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు.
గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం లో నిర్వహించిన జిల్లాస్థాయి ఫ్రీడమ్ కప్ ఫైనల్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో ఆయా గ్రామాల్లో ఉత్సాహవంతులైన క్రీడాకారులు ఆగస్టు 11, 16 తేదీల్లో నిర్వహించిన వడ్డీ లాంగ్ జంప్ వాలీబాల్ , టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో సుమారుగా 6100 మంది పాల్గొన్నారు. గ్రామస్థాయిలో విజేతలుగా;మొదటి స్థానం లో నిలిచిన 214 జట్టులతో అన్ని మండలాల్లో సుమారుగా 3000 మంది ప్రథమ స్థానంలో నిలిచిన జట్టు క్రీడాకారులతో ఆగస్టు 16, 17,18 తేదీలలో క్రీడలను నిర్వహించడం జరిగినదన్నారు. మండల స్థాయిలో విజేతలైన క్రీడాకారులు అన్ని మండలాల నుండి 67 క్రీడా టీములు సుమారుగా 900 మంది క్రీడాకారులు జిల్లా స్థాయిలో (ఆగస్ట్ 16,17,18) తేదీల్లో కోకో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్, తగ్గ ఫర్ క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. కబడ్డీ, కోకో, లాంగ్ జంప్, తగ్గ ఫర్, వాలీబాల్ క్రీడలలో విజేతలైన ప్రధమ, ద్వితీయ జట్లకు ఆగస్టు 19 తేదీన మెమెంటోలు అందజేయనున్నట్లు తెలిపారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 8 నుండి వివిధ రకాల కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఇదే స్ఫూర్తిని ఆగస్ట్ 22 వరకు నిర్వహించు కార్యక్రమాలలో కొనసాగించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Share This Post