జిల్లాలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుపై దృష్టి సారించాలి……… అదనపు కలెక్టర్ రాజర్షి షా

పత్రిక ప్రకటన
సంగారెడ్డి, జూలై 29:–

జిల్లాలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా మండల అభివృద్ధి అధికారి లకు సూచించారు.

గురువారం నాడు కలెక్టరేట్ ఆడిటోరియంలో మండల అభివృద్ధి అధికారులు,
గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు బృహత్ పల్లె ప్రకృతి వనము ఏర్పాటు పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జిల్లా లోని ( 26 ) మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో బృహత్ పల్లె ప్రకృతి వనం పది ఎకరాల లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగముగా ఒక్కో మండలములోనీ ఒక గ్రామ పంచాయతీ పరిధి లో ప్రభుత్వ భూమీని గుర్తించినట్లు తెలిపారు.

ప్రతి బృహత్ పల్లె ప్రకృతి వనములో 10 ఏకరాలలో 31,000 మొక్కలు నాటాలన్నారు. ఆగస్ట్ 19వ తేదీలోగా బృహత్ పల్లె ప్రకృతి వాహనాలు పూర్తి కావాలని ఆయన స్పష్టం చేశారు. దానికి సంబదించిన నమూనాలను పవర్ పాయింట్ ప్రజన్టేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతి అధికారులు, మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్ లతో హరిత హారం, మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్, ఉపాధి హామీ పథకంకూలీల చెల్లింపుల పై సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ సురేష్ మోహన్ , అడిషనల్ PD లు, APD లు పాల్గొన్నారు.

Share This Post