జిల్లాలో భూగర్భజలాలు అంతరించిపోకుండా జలశక్తి అభియాన్ కింద ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

జిల్లాలో భూగర్భజలాలు అంతరించిపోకుండా జలశక్తి అభియాన్ కింద ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను.  మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి మొదటి సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, డి.ఆర్.డి.ఏ తదితర శాఖల ద్వార ఏ గ్రామంలో ఎన్ని ఫీట్లకు భూగర్భ జలాలు ఉన్నాయి, బోర్లు వేసినప్పుడు ఎన్ని ఫీట్ల లోతులో నీరు వస్తుంది ఎంతమేర వస్తుంది అనే ఖచ్చితమైన డేటాను సేకరించి కేంద్ర జలశక్తి అభియాన్ శాఖాధికారులతో సమన్వయం చేసుకొని ఇతమిద్దంగా ఏ గ్రామంలో భూగర్భ జలాలు పెంచాల్సిన అవసరం ఉందొ నిర్ధారించాలన్నారు.  అందుకు అనుగుణంగా ఉపాధిహామీ ద్వారా భూగర్భజలాలు పెంచేందుకు పర్క్యులేషన్ ట్యాన్క్, ఇంకుడు గుంతలు వంటి పనులు మూమ్మరం    చేయించేందుకు దోహదపడుతుందన్నారు.  అనంతరం వివిధ లైన్ డిపార్ట్మెంట్ ల సహకారంతో తయారు చేసిన భూగర్భ జలాల  వార్షిక నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో జిల్లా భూగర్భ జల అధికారి రమాదేవి, సెంట్రల్ గ్రౌండ్ వాఁటర్ బోర్డు సైంటిస్ట్ డా. ఎస్. ఎస్. విట్టల్, పి డి. డిఆర్డీఏ నర్సింగ్ రావు, జి.యం ఇండస్ట్రీస్ హనుమంతు నాయక్, ఈ.డి. ఎస్సి కార్పొరేషన్ రాంలాల్, టి. మాత్యుస్, యం. లింగుస్వామి  తదితరులు పాల్గొన్నారు.

Share This Post