జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి గాను మత్స్య రైతులను ప్రోత్సహించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

మే.05 ఖమ్మం:

జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి గాను మత్స్య రైతులను ప్రోత్సహించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మత్స్య సంపద, రైతుల అభివృద్ధిపై గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో మత్స్య, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, మత్స్య రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి చర్యల పట్ల కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్య రైతుల అభివృద్ధికి, మత్స్య సంపదను పెంపొందించేందుకు గాను మత్స్య, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో ప్రతి నెలా రైతువేదికలలో రైతులు, మత్స్య రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్యకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, సదుపాయాల పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా మత్స్య రైతులను, మత్స్యకారులను ప్రోత్సహించే విధంగా శాస్త్రవేత్తలు ఆధునిక టెక్నాలజీని అనుసంధానం. చేసి మత్స్య సంపద ఉత్పత్తి పెంచే చర్యలపట్ల రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. వైరస్, ఫంగస్ వంటి రోగాల నివారణ చర్యల పట్ల రైతులు అవలంభించవలసిన పద్ధతులను తెలియజేస్తూ క్రమం తప్పకుండా చెరువులను సందర్శించి నివారణ చర్యలు చేపట్టాలని తద్వారా మత్స్య సంపద ఉత్పత్తులు పెరిగేందుకు దోహదపడాలని కలెక్టర్ అన్నారు. నీటి నాణ్యతను భూసార పరీక్షలను తరచుగా చేపట్టే విధంగా శాస్త్రవేత్తలు. జలాశయాలను సందర్శించి మత్స్యకారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి దిగుబడి పెంచే దిశగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో రైతులను సంఘటితపర్చి మంచినీటి చేపల పట్ల చైతన్యపర్చాలని దీనికి గాను మత్స్య, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే చేపల పెంపకం చేస్తున్న మత్స్య రైతులతో వారి అనుభవాలను, సలహాలను, సూచనలను ఇతర రైతులకు తెలియజేసి మత్స్య సంపదను మరింత అభివృద్ధి పర్చేందుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా మత్సశాఖ అధికారి అంజనేయులు, జిల్లా వ్యవసాయ శాఖ ఇంచార్జ్ అధికారి సరిత, కె.వి.కె శాస్త్రవేత్త హేమంత్ కుమార్, పాలేరు రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త రవీందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ రావు, మత్స్య శాఖ అధికారులు, మత్స్య రైతులు, నీటిపారుదల శాఖ అధికారులు. తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post