పత్రిక ప్రకటన తేది:12-01-2022
జిల్లాలో మహిళలకు సఖి సేవల పై అవగాహన కల్పించాలని, గృహ హింస నుండి ఉపశమనం కల్పించి, మహిళలకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ హాలు నందు మహిళా, శిశు సంక్షేమ శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ ఇంట్లో ఉండే స్త్రీ , పురుష సంబంధాలలో అసమానతలు ఏర్పడి గృహ హింస కు గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. గృహ హింస , పని చేసె చోట వేధింపులు, లైంగిక వేధింపులు, వరకట్నపు వేధింపులు, ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవాణా నివారణ కోసం మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181 కు కాల్ చేయాలనీ , హింస కు గురి అయిన బాలికలకు, మహిళలకు సఖి సెంటర్ నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అన్నారు. సమస్యాత్మకంగా ఉన్న కేసులు పోలీస్ ద్వారా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఒకసారి వచ్చిన కేసులు మళ్ళి మళ్ళి రిపీట్ అయితే అలాంటి కేసుల పై దృష్టి పెట్టాలని, లీగల్ సర్వీసెస్ వారితో అందుబాటులో ఉండి, వారి సలహాలు సూచనలు తీసుకోవాలని, అధికారులకు ఆదేశించారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ కేసులు రిజిస్టర్ చేసుకునే విధంగా వారికి గృహ హింస చట్టం పై అవగాహన కల్పించాలని అన్నారు. రెగ్యులర్ గా కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలని, క్వాలిటీ కౌన్సిలింగ్ పై దృష్టి పెట్టాలని, బాధితులకు మేము ఉన్నాము అనే బరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా లో కొత్త సఖి సెంటర్ భవన నిర్మాణం మొదలయ్యిందా అని, నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అదనపు కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ గ్రామ స్థాయి లో సమావేశాలు నిర్వహించి సఖి సేవల పై అవగాహన కల్పించాలని, గ్రామ స్తాయి లో సర్పంచ్ ఆధ్వర్యం లో ఒక వాలంటీర్ ను నియమించాలని అన్నారు. ప్రతి ఎస్.ఎచ్.జి సమావేశాలలో సఖి సేవల గురించి చెప్పాలని, అత్యవసవర సేవలకు మహిళలు హెల్ప్ లైన్ నెం. 181 కు ఫోన్ చేసి రక్షణ పొందవచ్చని తెలిపారు. కేసు లకు సంబంధించి నోటీసు లు ఇచ్చేటప్పుడు పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని అన్నారు.
ఇప్పటివరకు సఖి కేంద్రానికి వచ్చిన కేసుల వివరాలు మరియు సఖి కేంద్రం వారు చేసిన కార్యక్రమాలు సఖి సెంటర్ నిర్వాహకురాలు జయలక్ష్మి పవర్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
సమావేశం లో శిశు సంక్షేమ శాఖ అధికారిణి ముశాయిధ బేగం, డి.ఆర్.డి.ఎ ఉమాదేవి, డి.ఈ.ఓ సిరాజుద్ధిన్, గోవర్ధిని, , జయలక్ష్మి , సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
———————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల ద్వారా జారీ చేయడమైనది.