జిల్లాలో మిగిలిపోయిన మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తి చేయాలి :- జిల్లా కలెక్టర్ డి హరిచందన

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేది: 13-09-2021

జిల్లాలో మిగిలిపోయిన మరుగుదొడ్లు, ఇంకుడు  గుంతలు పూర్తి చేయాలి :- జిల్లా కలెక్టర్ డి హరిచందన

జిల్లాలో ఇప్పటి వరకు ఇంకా మరుగుదొడ్లు కట్టుకొని వారిని గుర్తించి నిర్మాణం పూర్తి చేసే విధంగా  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు ఎంపీఓ లతో ఓ.డి.యఫ్ ప్లస్ కార్యక్రమం పై సమీక్షా సమావేశం నిర్వహించారు .  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఇదివరకే నారాయణపేట జిల్లా ను భహిరంగా మలవిసర్జన రహిత (ODF)  జిల్లా గా ప్రకటించడం జరిగిందని  అందులో భాగంగా  జిల్లాలో ODF ప్లస్ ను అమలు చేయాలని సూచించారు.   గ్రామ ప్రజలు బహిరంగ మాలవిసర్జనకు వేళ్ళ కుండ ప్రతి ఇంటికి మరుగుదొడ్లను, గ్రామం లో పారిశుధ్యం పాటిస్తూ  నీటిని రోడ్డు పై వదల కుండ ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు   స్థలం లేని వారికి కమ్యూనిటీ ఇంకుడు గుంతలు  నిర్మించేల  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ లలో  ఎక్కడ కూడా బయట చెత్త వేయకుండా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలన్నారు. వాటిద్వారా కంపోస్టు ను తయారుచేసి వాటిని విక్రయించి  వాటిద్వారా గ్రామ పంచాయితీ కి ఆదాయం సమకూర్చుకోవఛ్చన్నారు.  ప్రతి గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రం లో మరుగుదొడ్లను నిర్మించాలని జిల్లా లో ఉన్న ప్రతి విద్యాసంస్థల లో బాలికలకు, బాలురు లకు   మూత్రశాలలు  మరుగుదొడ్లను ఏర్పాటుచేయాలని సూచించారు. బహిరంగ మలవిసర్జన వలన ప్రజలు అనారోగ్యానికి గురి అయే అవకాశాలు చాలా ఉన్నాయని  స్వచ్చ భారత్  మిషన్ ద్వారా మరుగుదొడ్లను నిర్మించుకోవచన్ని ప్రజలలో అవగాహన కల్పించాల్సిందిగా తెలియజేసారు. జిల్లాలో ఏ ఒక్కరూ బయట మాలమూత్ర విసర్జనలు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని యంపీడీఓ లను ఆదేశించారు.  ప్రతిరోజు గ్రామ లలో పారిశుధ్య కార్యక్రమ లు నిర్వహించాలని అధికారులు తమకు కేటాయించిన గ్రామ లకు చేరుకొని 100 శాతం ODFప్లస్  గా ప్రకటించడానికి కవలసిన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. వారం రోజులలో పూర్తిచేయాలని చేయాన్నిపక్షం లో చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో లో జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, డిఆర్డీఓ గోపాల్ నాయక్, ఈ.ఈ.పి.ఆర్ నరేందర్, మండల ప్రత్యేక అధికారులు, ఎపిడిఓ లు మరియు యంపీఓ లు తదితరులు పాల్గొన్నారు.

——————————————

జిల్లా పౌరసంబంధల అధికారి ద్వారా జారి.

Share This Post