జిల్లాలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 23: జిల్లాలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టుతున్నట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఒక ప్రకటనలో అన్నారు. జిల్లాలో ప్రత్యేక సర్వే ద్వారా 3 లక్షల 66 వేల 453 మంది 18 సంవత్సరాల వయస్సు పైబడినవారిని గుర్తించి, వంద శాతం వ్యాక్సినేషన్ కు పటిష్ట కార్యాచరణ చేశామన్నారు. జిల్లాలో బచ్చన్నపేట, తమ్మడపల్లి, పొచన్నపేట సబ్ సెంటర్ల పరిధిలో సదాశివపేట, కాశినగర్, చిన్నరాంచెర్ల, ఓబులకేషవాపూర్, పెద్దపహాడ్ సబ్ సెంటర్ పరిధిలో దిబ్బగుట్ట తాండ, చౌడర్ పల్లి, కళ్యాణ్ నగర్, వడ్లకొండ, మరిగడి, గానుగపహాడ్ సబ్ సెంటర్ల పరిధిలో సుందరయ్య నగర్, పెద్దతాండ, బాచ్యతాండ, రెక్యాతాండ, పంతులు తాండ, భూక్యా తాండ, భాజియా తాండ, మంకు తాండ, మామాజి తాండ, టక్యా తాండ, కాసిగుడిసెలు, గోవింద్ తాండ, ఏసీ రెడ్డి నగర్, తుకుంబాయి తాండ, కొర్ర తాండ, పంతులు తాండ, వెల్డి, నిదిగొండ, ఫతేషాపూర్, బాణాజిపేట సబ్ సెంటర్ల పరిధిలో ఊరగుంట గూడెం, ద్యాగలగూడెం, ఈస్ట్ గుంటూరు గూడెం, పోతారాజుతాండ, కాల్వల పల్లి, ఎల్లారెడ్డి గూడెం, లింగం, జఫర్ గఢ్ సబ్ సెంటర్ పరిధిలో అలియాబాద్, చిన్న పెండ్యాల, శ్రీపతిపల్లి సబ్ సెంటర్ల పరిధిలో గెమ్యా తాండ, రత్ననాయక్ తాండ, సముద్రాల, కోమటిగూడెం సబ్ సెంటర్ల పరిధిలో నారాయణ పూర్, గుంటూరు పెల్లి, కోమటిగూడెం, అక్కపల్లిగూడెం, బోయినిగూడెం, దర్దపల్లి సబ్ సెంటర్ పరిధిలో గుడొల్లగూడెం హాబీటెషన్లు మొత్తం 38 హాబీటేషన్లలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు, ఇదే స్ఫూర్తితో జిల్లాను వంద శాతం వ్యాక్సినేషన్ జిల్లాగా వడివడిగా అడుగులు వేస్తున్నట్లు ఆయన అన్నారు. బుధవారం నాటికి 2 లక్షల 35 వేల 909 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆయన అన్నారు. ఇందులో 2 లక్షల 35 వేల 909 మంది మొదటి డోస్, 66 వేల 603 మంది రెండో డోస్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో జనవరి 16 న వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రాధాన్యత క్రమంగా వ్యాక్సినేషన్ మొదలెట్టి, క్రమంగా 45 సంవత్సరాలు, 18 సంవత్సరాల పైబడిన అందరికి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టి, రేషన్ షాపు, ఎల్పీజీ, ఎఫ్సిఐ, జర్నలిస్టులు, ఫర్టిలైజర్, ఆర్టీసీ, వీధి వ్యాపారులు తదితర కరోనా ప్రమాద తీవ్రత ఉన్నవారికి వ్యాక్సినేషన్ చేశామన్నారు. ఈ నెల 16 నుండి ప్రత్యేక సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 104 సబ్ సెంటర్లు, పట్టణంలోని 30 వార్డుల్లో సూక్ష్మ ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా చేపట్టనైనది. జిల్లా అధికారులను మండల, వార్డు ప్రత్యేక అధికారులుగా నియమించి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై పటిష్ట పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టి, ఇంటిలో ఎంత మంది 18 సంవత్సరాల వయస్సు పైబడినవారు ఉన్నది, ఎంతమంది వ్యాక్సిన్ తీసుకుంది, ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సి ఉంది ఖచ్చితమైన వివరాలు సేకరించి, స్టిక్కర్ పై పొందుపర్చి, ఇంటింటికి అంటించే కార్యక్రమం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజాప్రతినిధులను వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి, వారిని సమన్వయం చేసుకుంటూ, అధికారులు, సిబ్బందితో ప్రజల్లో వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించి, వ్యాక్సిన్ పై చైతన్యం తేస్తున్నట్లు ఆయన అన్నారు. సర్వేలో వ్యాక్సిన్ తీసుకొనని వారు ఎక్కువగా వున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నియంత్రణకై వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని కలెక్టర్ అన్నారు. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని, ఎలాంటి భయం, అపోహలు వద్దని ఆయన తెలిపారు. వృద్దులు, గర్భిణులు, బాలింతలు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వస్తే, వ్యాక్సిన్ తో శరీరం రోగనిరోధక శక్తిని కల్గివుంటుందని, ప్రాణాపాయం ఉండదని ఆయన తెలిపారు. ఆరోగ్య సమాజ నిర్మాణానికి 18 సంవత్సరాల వయస్సు నిండిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post