జిల్లాలో మే 6 నుండి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలు సజావుగా జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

జిల్లాలో మే 6 నుండి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలు సజావుగా జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లప్లై విద్య, వైద్య, రెవిన్యూ, పొలీసు, విద్యుత్, ఆర్.టి.సి. పోస్టల్ తదితర అనుబంధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ లలో భద్రపరుస్తున్న ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించుటకు, సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు, పరీక్షా కేంద్రాలకు అవసరమైన పొలీస్ బందోబస్త్ ను ఏర్పాటు చేయాలని పొలీసు అధికారులకు సూచించారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాలలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని సూచించారు.

పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు అవసరమైన సిబ్బందిని, ఇన్విజిలేటర్లను కేటాయించాల్సిందిగా విద్యాశాఖాధికారికి సూచించారు .

అన్ని పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో అవసరమైన మందులు, ఓ.ఆర్ .ఎస్. ప్యాకెట్లతో ఏ.ఎన్.ఏం. లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని, విద్యుత్ లో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆయా రోజులలో అదనంగా బస్సులు నడపాలని ఆర్టీసీ వారికి సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు మొదటి సంవత్సరం 17,124 మంది, రెండో సంవత్సరం 15,390 మంది( మొత్తం 32,514 మంది) విద్యార్థులు హాజరు కానున్నట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్ష ల నిర్వహణకు 47 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తానని వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి గోవింద రామ్ , విద్య ,పోలీసు పోస్టల్, విద్యుత్, రెవిన్యూ , సంబంధిత శాఖల అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.

Share This Post