జిల్లాలో మొదటి,రెండో డోస్ తీసుకొని వారు ఒక్కరూ ఉండొద్దు : జిల్లా కలెక్టర్ శ్రీ యం. హనుమంతరావు

జిల్లాలో మొదటి,రెండో డోస్ తీసుకొని వారు ఒక్కరూ ఉండొద్దు

– ఈ వారం వాక్సినేషన్ వీక్ గా ప్రకటన

– ప్రత్యేక టీమ్ లతో వారంలో మొదటి, రెండో వాక్సినేషన్ శత శాతం లక్ష్యం సాధించాలి

– ఆరోగ్య సేవలు అందించే విషయంలో, సమయ పాలన లో సిద్దిపేట వైద్య ఆరోగ్య శాఖ మోడల్ గా నిలవాలి

– సిద్దిపేట జిల్లాను ను సంపూర్ణ వాక్సినేషన్ జిల్లాకు డిక్లేర్డ్ చేసేలా కృషి చేయాలి

– వాక్సినేషన్ లో ఏమర పాటుగా ఉండొద్దు

– మూడో వేవ్ కు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మానసికంగా, శారీరకంగా సర్వసన్నద్ధంగా ఉండాలి

– స్కైప్ అప్లికేషన్ ద్వారా త్వరలోనే వైద్య ఆరోగ్య సిబ్బంది, రోగుల తో నేరుగా మాట్లాడేలా ఏర్పాటు చేస్తాం

——————————-
సిద్దిపేట 30, నవంబర్ 2021: ——————————-
సిద్దిపేట జిల్లాలో 18 సంవత్సరాలు నిండి మొదటి,రెండో డోస్ తీసుకొని వారు ఒక్కరూ ఉండొద్దనీ జిల్లా కలెక్టర్ శ్రీ యం. హనుమంతరావు వైద్య అధికారులకు స్పష్టం చేశారు.కరోనా మూడో వేవ్ ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను చైతన్యం చేసేందుకు , వాక్సినేషన్ సంతృప్త స్థాయిలో ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని అన్నారు.

కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ఆందోళనలు రేకెత్తిస్తున్న వేళ జిల్లా కలెక్టర్ శ్రీ ఏం హనుమంతరావు IDOC మీటింగ్ హల్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో
కీలక సమావేశం నిర్వహించారు.

జిల్లాలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై జిల్లాలోని PHC వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, ఉప వైద్యా ధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో 92 శాతం మందికి మొదటి డోస్ వాక్సినేషన్ పూర్తి అయ్యిందన్నారు. రెండో డోస్ ఇంకా 74 వేలమందికి ఇవ్వాల్సి ఉందన్నారు.
వాక్సినేషన్ తీసుకోకపోతే
మూడో వేవ్ , ఒమి క్రాన్ వస్తే ఎదురయ్యే అనర్థాలను ప్రజలకు వివరించి
టార్గెట్ ఓరియంటెడ్ గా వాక్సినేషన్ ను మిషన్ మోడ్ లో చేపట్టాలన్నారు.
శత శాతం వాక్సినేషన్ లక్ష్యం ను సాధించేందుకు ఈ వారం ను వాక్సినేషన్ వీక్ గా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రత్యేక టీమ్ లతో వారంలో మొదటి, రెండో వాక్సినేషన్ శత శాతం సాధన లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు.

ANM, సబ్ సెంటర్, PHC, CHC వారీగా మొదటి , రెండో డోస్ తీసుకొని వారిని గుర్తించి వాక్సినేషన్ ఇవ్వాలన్నారు.
వాక్సినేషన్ లో ఏమర పాటుగా ఉండొద్దన్నారు.
మూడో వేవ్ కు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మానసికంగా, శారీరకంగా సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు.

సమయపాలన,ఆరోగ్య సేవల విషయంలో మోడల్ గా నిలవాలి

సిద్దిపేట పేట వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమయపాలన ఆరోగ్య సేవల విషయంలో మోడల్ గా నిలవాలని జిల్లా కలెక్టర్ శ్రీ యం. హనుమంతరావు సూచించారు.
IDOC నుండి స్కైప్ అప్లికేషన్ ద్వారా త్వరలోనే వైద్య ఆరోగ్య సిబ్బంది, రోగుల తో నేరుగా మాట్లాడేలా త్వరలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలను నేరుగా మాట్లాడి తెలుసుకుంటామని అన్నారు. క్షేత్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హాజరు ను మానిటర్ చేస్తామని తెలిపారు.

అంగని వాడి నుంచి కళాశాల విద్యార్థులకు ప్రాథమిక నేత్ర స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి

సిద్దిపేట జిల్లా లో అంగన్వాడి విద్యార్థుల నుంచి కళాశాల విద్యార్థుల వరకు నేత్ర సంబంధిత సమస్యల పరిష్కారానికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చిందన్నారు. ఆయా విద్యార్థుల నేత్ర సంబంధిత దృష్టి లోపాలను గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చే సోమవారం నుండి ప్రాథమిక స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అందుకు సంబంధించి ప్రిప రేటరీ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు . వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రాథమిక స్క్రీనింగ్ అనంతరం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్య సిబ్బంది దృష్టి లోపాలు ఉన్నా విద్యార్థులకు ఫైనల్ స్క్రీనింగ్ నిర్వహించి దృష్టి లోపాలు అన్నట్లు రూఢి అయితే .. వాటిని సవరిస్తా రని జిల్లా
కలెక్టర్ తెలిపారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్, డా. మనోహర్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. విజయ రాణి తదితరులు పాల్గొన్నారు .

——————————
డీ.పీ.ఆర్.ఓ, సిద్ధిపేట కార్యాలయంచే జారీ చేయనైనది

Share This Post