జిల్లాలో మోడల్ పాఠశాలల అభివృద్ధి పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక

జిల్లాలో మోడల్ పాఠశాలల అభివృద్ధి పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం
సెప్టెంబర్ 22 మహబూబాబాద్

జిల్లాలో మోడల్ పాఠశాలల అభివృద్ధి పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారి తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలోని మోడల్ పాఠశాలల అభివృద్ధి పనుల పురోగతి, మన ఊరు మనబడి కింద జరుగుతున్న
పాఠశాల ల అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా కురవి, చిన్నగూడూరు, డోర్నకల్, కేసముద్రం, మండలాల్లో 104 పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇప్పటికే పూర్తయిన పనులకు ఎం. బి .లు త్వరగా రికార్డు చేసి ఎఫ్. టి .ఓ లు జనరేట్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మోడల్ స్కూల్ కోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో గుర్తించిన పనులను వారం రోజులుగా పూర్తిచేయలని, మన ఊరు మనబడి కింద మేజర్, మైనర్ మరమ్మతులను, త్రాగునీటి వసతి, విద్యుచ్చక్తి, పనులతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ కింద టాయిలెట్లు వంట గదుల నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ ,
డి .ఈ .లు, ఆయా మండలాల ఏఈలు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post