శనివారం నాడు కలక్టరేట్ మినీ కాన్ఫెరెన్స్ హాలులో రాజ్య సభ సభ్యులు బండ ప్రకాష్,హనుమకొండ వరంగల్ కలక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు ,గోపి లతో కలసి యువతకు ఉపాధి అవకాశాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హైదరాబాద్ తరువాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు వరంగల్ హనుమకొండ అని అన్నారు.అత్యధికమంది డిగ్రీ ,ఇంజనీర్ ,ఇతర పట్టాలతో యువత వస్తున్నారని వారికీ సరి అయిన శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కరోన మహమ్మారితో రెండెళ్లుగా ప్రభుత్వ ప్రయివేటు రంగ సంస్ధలు పరిశ్రమలు తీవ్ర ఒడిదుడుకులకు గురై ఆర్థిక రంగం దెబ్బతిని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత చిన్నాభిన్నమైనందున వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి చిత్త శుద్ధి తో కృషి చేయాలనీ అన్నారు. హనుమకొండ నగరన్ని ఎడ్యుకేషన్ హబ్ తో పాటు ఎంప్లాయ్మెంట్ హబ్ గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందనీ అన్నారు.హనుమకొండ టాస్క్ సెంటర్ లో ఇప్పటి వరకు 2300 మంది ట్రైనింగ్ తీసుకొని 1100 మందికి వివిధ కంపెనీ లలో ఉద్యోగంలో చేరారు.
రాజ్య సభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్హతలను బట్టి యువతకు వారికి ఏ రంగంలో శిక్షణ ఇస్తే బాగుంటుందో పథకాలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఒకటి రెండు సంవత్సరాలు ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తే ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు గొప్పగా కొనసాగుతాయనీ అన్నారు .వ్యవసాయం, అనుభంద రంగాలు ,టూరిజం,నిర్మాణ రంగం, డ్రైవింగ్, విద్యుత్,భూసర్వే లాంటి శాఖలలో నైపుణ్య శిక్షణ పొందిన వారికి ఎన్నో ఉపాధి మార్గాలు ఉన్నాయనీ అన్నారు. ఇక్కడే ఉపాధి కల్పిస్తే వలసలు కూడా తగ్గుతాయని అయన అన్నారు