జిల్లాలో రక్త నమోనాల సేకరణ కొరకు ఏర్పాటు చేసిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి రోగ నిర్ధారణ కొసం రక్త నమోనాల సేకరణ ప్రతిరోజు సకాలంలో జరగాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్య అధికారులను సూచించారు.

ఈరోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద నుండి వైద్య శాఖ ఆధ్వర్యంలో రక్త నమోనాల సేకరణ కొరకు ఏర్పాటు చేసిన రెండు వాహనాలను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిరోజు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి రక్త నమోనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ కు వాహనాల ద్వారా తరలించినట్లయితే, సేకరించిన నమోనాల పరీక్షలు నిర్వహించి అట్టి రిపోర్టులను PHC కి, అలాగే రోగి ఫోన్ కు పంపడం జరుగుతుంది. దీని వల్ల రోగ నిర్ధారణ జరిగి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుపడుతుందన్నారు. రక్త నమోనాల సేకరణ ప్రతిరోజు వాహనముల ద్వారా జరగాలని ఆదేశించారు. అనంతరం D-హబ్ లో నిర్వహిస్తున్న పరీక్షలను, పని తీరును సంబంధిత వైద్య అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారం, Dy. DMHO జీవరాజ్, డా. బిజినిల్, డా. అరవింద్, డా. పవిత్ర ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post