జిల్లాలో రహదారి ప్రమాదాలు తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్, జిల్లా రహదారి భద్రత కమిటీ చైర్మన్‌ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో,పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన జిల్లాస్థాయి రహదారుల భద్రత కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లాలో రహదారుల కండిషన్ మరియు గత కొంత కాలంగా జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదాలపై నేషనల్ హైవే,
ఆర్ అండ్ బి , పంచాయతీరాజ్ ఇంజనీర్లు మరియు రవాణా, పోలీస్ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లా లో రహదారి ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలలో ట్రాఫిక్‌ నియమాలపై అవగాహాన కల్పించడం ద్వారా ప్రమాదాల నివారణకు సంబందిత శాఖలు కృషి చేయాలని కోరారు. నియమాలను ఉల్లంఘిస్తూ తరచు ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లను గుర్తించి, వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేకించి ద్విచక్రవాహన దారులు తప్పని సరిగా హెల్మెట్‌ వాడాలని, లేన్‌ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు తమ లేన్‌లో వెళ్లకుండా అడ్డదిడ్డంగా ప్రయాణించినప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. సబర్బన్‌ ఏరియా నుంచి నగరంలోకి వచ్చే ద్విచక్రవాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని పనులు చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై కనీస అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన సంఖ్యను బట్టి బ్లాక్‌ స్పాట్లుగా విభజించామని అందుకనుగుణంగా అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
గత మూడు సంవత్సరాలుగా ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రమాదాలను జీరో స్థాయి కి తీసుకుని రావాలని అన్నారు. తదుపరి సమావేశం నాటి కల్లా పూర్తి స్ధాయిలో జాయింట్ కమిటీ లను ఏర్పాట్లు చేయాలని అన్నారు.ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అన్నారు.

పోలీసు కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ ప్రాణాల కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదని, అన్నారు. జాతీయ రహదారుల అథారిటీ పరిధిలో గల రోడ్ల విస్తరణ, సర్వీసు రోడ్ల నిర్మాణం , ఆక్రమణల తొలగింపు, ఇతర మరమ్మత్తు పనులను పోలీసు, రెవెన్యూ,, సంబంధిత శాఖల అధికారులు జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు

డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పురుషోత్తం మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తూ , సురక్షితంగా ప్రయాణించే విధంగా ఎప్పటి కప్పుడు సమస్యలను సమన్వయంతో పరిష్కరిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మి సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప , ఆర్ ఎండ్ బి ఎస్ ఈ నాగేశ్వరరావు,ఏసిపి జితేందర్ రెడ్డి,బాలస్వామీ అడిషనల్ డిఎం ఎండ్ హెచ్ వో మన్మోహన్, ఇతర ఉన్నాతీధికారులు శ్రీనివాస్,భిక్షపతి, సుశ్మా తదితరులు పాల్గొన్నారు.

Share This Post