జిల్లాలో రహదారుల పనులు త్వరగా పూర్తి చేయాలి  : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలో రహదారులు, అంతర్గత రహదారులు, వంతెనల నిర్మాణ/ మరమ్మత్తు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన నముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అటవీ అధికారి శాంతారామ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ మధునూదన్‌ నాయక్‌తో కలిని జిల్లా అటవీ, రెవెన్యూ, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌, ల్యాండ్‌ నర్వే అధికారులతో అటవీ – రెవెన్యూ భూముల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న రహదారులు, అంతర్గత రహదారులు, వంతెనల నిర్మాణ / మరమ్మత్తుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, వేమనపల్లి మండలంలోని లక్ష్మీపూర్‌ నుండి బద్దంపల్లి వరకు, నెన్నెల మండల కేంద్రం నుండి కుశ్నపల్లి మీదుగా చామన్‌పల్లి వరకు, బెల్లంపల్లి నుండి బుగ్గ రాజేశ్వరస్వామి దేవాలయం వరకు, నెన్నెల మండంలో ఖాజీపల్లి నుండి ఆవుడం వరకు, కోటపల్లి మండలంలోని రాచెర్ల నుండి అన్నారం మీదుగా అర్జునగుట్ట వరకు, వేమనపల్లి మండల కేంద్రం నుండి నాగారం వరకు, కోటపల్లి మండలం బార్‌పల్లి నుండి రాజారాం మీదుగా బబ్బెరచిలుక వరకు, బొప్పారం నుండి కల్మల్‌ వరకు, వేమనపల్లి నుండి కమ్మర్‌గాం వరకు, జన్నారం మండలం మొగర్రిగూడ నుండి కలమడుగు వరకు, వెంకటాపూర్‌ నుండి కలమడుగు వరకు రహదారులు, వంతెనల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జాతీయ రహదారి 68లో జిల్లా పరిధిలో పెండింగ్‌లో ఉన్న నమన్యలను పరివ్మరించాలని, చెన్నూర్‌ నియోజకవర్గ పరిధిలోని జోడువాగుల వద్ద నిర్మించవలసిన రహదారికి నంబంధించిన క్లియరెన్స్‌ లను నంబంధిత శాఖల అధికారులు త్వరగా జారీ చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీనుకోవాలని, అన్ని వివరాలతో పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి అందించాలని నంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రోడ్లు, భవనాల శాఖ ఈ.ఈ. రాము, జిల్లా పంచాయతీరాజ్‌ ఈ. ఈ. ప్రకాష్‌, ల్యాండ్‌ నర్వే
శాఖ ఏ.డి. శ్రీనివాన్‌, బెల్లంపల్లి రాజన్వ మండల అధికారి శ్యామలాదేవి, మంచిర్యాల, చెన్నూర్‌ అటవీ డివిజనల్‌ అధికారులు వినయ్‌కుమార్‌, రమేష్‌, ఎఫ్‌.ఆర్‌.ఓ.లు, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post