జిల్లాలో రెండవ డోస్ వాక్సినేషన్  వందశాతం జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు.

జిల్లాలో రెండవ డోస్ వాక్సినేషన్  వందశాతం జరిగేలా ప్రజా ప్రతినిధులు,
అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి
అన్నారు.

మంగళవారం రంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో కోవిడ్
వాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్ పై నిర్వహించిన సమీక్ష సమావేశానికి
ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజ‌ర‌య్యారు.

కోవిడ్ మొదటి, రెండవ దశలో బాగా పని చేసిన వైద్య విభాగం వారికి,
మునిసిపల్, పంచాయతీ రాజ్, పోలీస్ శాఖల వారికి  ఈ సందర్బంగా మంత్రి
అభినందనలు తెలిపారు. కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోస్ జిల్లాలో 106 శాతం
పూర్తి చేయడం జరిగిందని మంత్రి అన్నారు.  రెండవ డోస్ కూడా వంద శాతం
పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవటానికి ప్రభుత్వం, వైద్య శాఖ సిద్దంగా
ఉందన్నారు.  కోవిడ్ ప్రమాణాలు పాటించేలా చూడాల‌న్నారు. తక్కువ
వాక్సినేషన్ ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టి
పూర్తి స్థాయిలో వాక్సిన్ వేసేలా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు,
అధికారులు కలిసి ప్రజల్లో అవగాహన కల్పించి జాగృత పర్చాలని మంత్రి కోరారు.

ప్రభుత్వ పాఠశాలలో  పరిశుభ్రత  గ్రామ పంచాయతీ సిబ్బంది బాధ్యత అని మంత్రి
స్పష్టం చేసారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ
పాఠశాలలను సందర్శించి టీచరులు, సిబ్బంది రెండు డోసుల వ్యాక్సినేషన్
తీసుకునేలా విద్యార్థులకు చూడాలని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా
చర్యలు చేపట్టాలని విద్యాశాఖ  అధికారికి   మంత్రి సూచించారు.

రంగారెడ్డి జిల్లాలో ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి వలస రావడం
జరుగుతుంది కాబట్టి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి 100 శాతం వాక్సినేషన్
ను పూర్తి చేసి కోవిడ్ ను నిర్ములించాలని తెలిపారు పరిశ్రమల్లో, ఇటుక
బట్టీలలో పని చేసేవారిని, మురికి వాడలలో నివసించే వారిని గుర్తించి
స్పెషల్ డ్రైవ్ ద్వారా వాక్సినేషన్ చేయాలనీ సూచించారు .  ప్రజా
ప్రతినిధులు అందరూ ప్రజల ఆరోగ్యం కోసం  ఇంటింటికి వెళ్లి మరీ వాక్సిన్
వేయించాలని, ప్రజలను చైతన్య వంతులను చేయాలని కోరారు.  ఓమిక్రాన్ వేరియంట్
పై భయం వద్దు, జాగ్రత్తలు పాటించి జయిద్దామని తెలిపారు. ఎలాంటి
పరిస్థితులు ఎదురైన ఎదుర్కోవాటానికి  ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి
తెలియజేసారు.  ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకోవాలని, మాస్క్ పెట్టుకోవాలి,
భౌతిక దూరం  పాటించాలని సూచించారు.

ఈ సమావేశంలో మూసి రివర్ బోర్డు చైర్మన్ సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్
తీగల అనిత రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, అంజయ్య యాదవ్, కలెక్టర్
అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, డీసీసీబీ చైర్మన్ మనోహర్
రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగ రెడ్డి, జడ్పీ సీఈఓ దిలీప్
కుమార్, వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీపీ,
జడ్పీటీసీలు,ఎంపీడీవోలు తహసీల్దార్లు, మునిసిపల్ మేయర్, డిప్యూటీ
మేయర్లు, చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు, మునిసిపల్
కమిషనర్లు,వైద్యాధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post