జిల్లాలో రెండవ డోస్ వాక్సినేషన్ వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ రు.

జిల్లాలో రెండవ డోస్ వాక్సినేషన్ వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వైద్య అధికారులకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు.

ఆదివారం కలెక్టర్ కార్యాలయ కోర్ట్ హాలులో వాక్సినేషన్ పై వైద్య అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అదక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో గ్రామాల వారీగా వాక్సినేషన్ రెండవ డోస్ వంద శాతం పూర్తి అయ్యేలా, సబ్ సెంటర్ల వారీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని లక్ష్యాన్ని పూర్తి చేయాలనీ అన్నారు.

మహిళా సమాఖ్య గ్రూప్ సభ్యులు అందరు వాక్సినేషన్ తీసుకునేలా మహిళా సమాఖ్య గ్రూప్ అధ్యక్షురాలు బాధ్యత తీసుకునేలా ఉపాధి హామీ కింద పని చేసే వారందరు కూడా వాక్సినేషన్ తీసుకునేలా టెకిన్నికల్ అసిస్టెంట్లు బాధ్యత తీసుకునేలా చర్యలు చేపట్టాలని పిడి డి ఆర్ డి ఏను ఆదేశించారు. వైద్య, పంచాయతీ శాఖలు, డి ఆర్ డి ఏ సమన్వయంతో పని చేసి జిల్లాలో రెండవ డోస్ వాక్సినేషన్ వంద శాతం పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. మొదటి డోస్ తీసుకొని వారిని గుర్తించి రెండు డోసులు వాక్సినేషన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.

గ్రామపంచాయతీలలో ఎంపిడిఓలు, ఎంపిఓలు, పంచాయతి సెక్రటరీలు, మునిసిపాలిటీలలో మున్సిపాలిటీ అధికారులు వైద్య అధికారులకు సహకరించి అందరు వాక్సినేషన్ తీసుకునేలా పని చేయాలనీ కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరులు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పిడి డి ఆర్ డి ఏ ప్రభాకర్, ఇంచార్జి జిల్లా వైద్య అధికారి అరుణ కుమారి, వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post