*జిల్లాలో రేపు శుక్రవారం, ఆదివారం వరి కోతల విరామం* #వ్యవసాయ శాఖ,పౌర సరఫరాల శాఖ,పోలీస్, హార్వెస్టర్ల యజమానులు,మండల రైతు బంధు సమితి అధ్యక్షు లు మిల్లర్ లతో అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, డి.ఐ.జి.ఏ వి.రంగ నాథ్ లు సమీక్ష సమావేశం లో నిర్ణయం.

నల్గొండ,అక్టోబర్ 28.జిల్లాలో వానాకాలం ధాన్య సేకరణ లో రైతాంగంకు ఇబ్బంది లేకుండా రేపు శుక్రవారం, ఆదివారం రెండు రోజులు ” *వరి కోతల విరామం*” ను జిల్లా యంత్రాంగం ప్రకటించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,డి.ఐ. జి.ఏ.వి.రంగనాథ్ లు పౌర సరఫరాల శాఖ,వ్యవసాయ శాఖ,పోలీస్,హార్వెస్టర్ యజమానులు,మండల రైతు బంధు సమితి అధ్యక్షులు, మిల్లర్ల తో సమావేశం నిర్వహించి వానా కాలం దాన్యం సేకరణ లో ఇబ్బందుల పై చర్చించారు.ధాన్య సేకరణ లో ఒకే సారి హార్వెస్టర్ యంత్రం లతో కోతలు కోయడం,పెద్ద ఎత్తున దాన్యం మిల్లులకు సామర్త్యానికి మించి రావడం తో మిల్లుల వద్ద,కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడి,మిల్లుల వద్ద దాన్యం నిల్వలు క్లియర్ కాక, దాన్యం దిగుమతి చేసుకోవడం లో జాప్యం జరిగి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాలపై ఈ నెల 26 న మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వానాకాలం దాన్యం కొనుగోళ్ల పై నిర్వహించిన సమావేశం లో చర్చించి,హార్వెస్టర్ లను నియంత్రించాలని,కొనుగోలు కేంద్రాల వద్ద,మిల్లుల వద్ద ట్రాక్టర్ ల రద్దీ తగ్గించేందుకు సమావేశం జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం ను ఆదేశించారు.మంత్రి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,డి.ఐ. జి.ఏ.వి.రంగ నాథ్ లు హార్వెస్టర్ యజమానులు,మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు,రైతు సంఘాల ప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిపి చర్చించారు.ఈ సమావేశం లో రేపు శుక్రవారం అక్టోబర్ 29,ఆదివారం అక్టోబర్ 31 న రెండు రోజులు ” *వరి కోతల విరామం* “ప్రకటించారు.ప్రతి వారం కూడా రెండు రోజులు వరి కోతల విరామం ప్రకటిస్తూ మిల్లర్ లు,మండల రైతు బంధు సమితి అధ్యక్షులు,సభ్యులు,హార్వెస్టర్ యజమానుల అంగీకారం తో నిర్ణయం తీసుకున్నారు.రేపు శుక్రవారం,ఆదివారం వరి కోతల విరామం ప్రకటిస్తూ,వచ్చే వారం నుండి గురువారం,ఆదివారం రెండు రోజులు వరి కోత ల విరామం ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు.సోమవారం సమావేశం జరిపి పరిస్థితి,అవసరాన్ని బట్టి గురు వారం,ఆదివారం రెండు రోజులు వచ్చే వారం నుండి వరి కోతల విరామం పై నిర్ణయం ప్రకటిస్తామని డి.ఐ. జి.ఏ.వి.రంగనాథ్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లు తెలిపారు.ముఖ్యంగా హార్వెస్టర్ యజమానులు వరి కోతలు చేసేప్పుడు బ్లోయర్ లు ఉపయోగించాలని,బ్లోయర్ వలన దాన్యం లో తాలు,మట్టి పెళ్లలు తగ్గి నాణ్యమైన ధాన్యం వస్తుందని, కొనుగోలు కేంద్రాలు,మిల్లు ల వద్ద తొందరగా కొనుగోలు,రవాణా అవుతుందని, హార్వెస్టర్ యజమానులు అందరూ పాటించాలని అన్నారు అదే విధంగా పూర్తిగా పక్వానికి రాని దాన్యం కోతలు కోయ వద్దని కూడా అధికారులు హార్వెస్టర్ యజమానులకు సూచించారు.సమావేశం లో మిల్లర్ లు సన్న దాన్యం కు సరైన ధర చెల్లించడం లేదని మండల  రైతు బంధు సమితి అధ్యక్షులు సమావేశం లో అధికారుల దృష్టి కి తీసుకు రాగా,నాణ్యత ప్రమాణాలు మేరకు సరైన ధర చెల్లించాలని మిల్లర్ లను జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేశారు.మిల్లర్ లు తప్పుడు పద్ధతులు అవలంబించి రైతు లను ఇబ్బందికి గురి చేస్తే చర్యలు తీసుకుంటామని డి.ఐ. జి.ఏ.వి.రంగనాథ్ సమావేశం లో తెలిపారు. గతంలో లాగానే రైతులకు టోకెన్ లు జారీ చేసి క్రమ బద్దీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.పోలీస్,రెవెన్యూ,వ్యవసాయ అధికారులు టోకెన్ లు జారీ చేయాలని అన్నారు.ఈ సమావేశం లో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు రాం చంద్ర నాయక్,  జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,వ్యవసాయ శాఖ ఏ.డి.హుస్సేన్ బాబు,నల్గొండ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు సి.హెచ్.యాదగిరి,గౌరవ అధ్యక్షులు కందుకూరి మహేందర్,మిర్యాలగూడ రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు గౌర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Share This Post