జిల్లాలో రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో ఆదార్ ఆధారిత ఒటిపి దృవీకరణ తప్పని సరి అని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

పత్రికా ప్రకటన                                                                తేది 18-11-2021

జిల్లాలో రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో ఆదార్ ఆధారిత ఒటిపి  దృవీకరణ తప్పని సరి అని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అయన మాట్లాడుతూ  రైతులు   ఎన్ని ఎకరాలలో ఎంత పంట పండించారు,  కొనుగోలు సెంటర్ల లో ఎంత ధాన్యం అమ్ముతున్నారనే వివరాలు వారి  ఫోన్ నెంబర్ కు వచ్చే ఓటిపి  ద్వారా తెలుసుకోవడం  సాద్యమవుతుందని అన్నారు.

జిల్లా లో  అన్ని ప్రాంతాలలో  69 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని,  కేంద్రాలలో ఇంచార్జ్ లను ఏర్పాటు చేసి వారికీ శిక్షణ నిచ్చామని తెలిపారు. రైతుల ఆదార్ నెంబర్ కు వారి  మొబైల్ నెంబర్ లింక్ చేయాలనీ,     గ్రామాలలో దగరలో ఉన్న పోస్టాఫీసు లేదా పోస్ట్ మ్యాన్ వద్దనే ఆదార్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చని తెలిపారు.  ఓపి ఎం ఎస్ ఆన్లైన్ సిస్టం ఓపెన్ చేస్తే   రైతుల  పూర్తి వివరాలు  డిస్ప్లే అవుతాయని తెలిపారు.  కౌలు రైతుల నుండి భూమి యజమాని  ఒటిపి తో మాత్రమె దాన్యం కొనుగోలు చేయబడుతుందని తెలిపారు. దాన్యం లో తేమ శాతం గుర్తించే మిషన్లు, సుబ్రపరిచే మిషన్లు  ఏర్పాటు చేయాలనీ రైస్ మిల్లర్లకు  సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

జిల్లా సివిల్ సప్లై అధికారి రేవతి, డి.ఎం ప్రసాద రావు, పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయడమైనది.

 

 

 

Share This Post