జిల్లాలో రైతులు పండించిన ఉత్పత్తులను లాభదాయకంగా అమ్ముకునేందుకు రైతు ఉత్పత్తి సంఘం గా ఏర్పడేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు.

జిల్లాలో రైతులు పండించిన ఉత్పత్తులను  లాభదాయకంగా అమ్ముకునేందుకు రైతు ఉత్పత్తి సంఘం గా ఏర్పడేందుకు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాబార్డ్, జిల్లా వ్యవసాయ శాఖ, లీడ్ బ్యాంక్ అధికారులతో  ఫార్మర్ ప్రిడ్యూసర్ ఆర్గనైజేషన్ ( రైతు ఉత్పత్తి సంఘం) జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  నారాయణపేట లో కొస్గి, నర్వ, నారాయణపేట మండలాల్లో  మామిడి, చింతపండు, ఔషధ సుగంధ ఉత్పత్తుల ను పందించేందుకు వాటిని నిల్వ చేసి డిమాండు ఉన్నప్పుడు అమ్ముకొని లాభ పడవచ్చన్నారు.  ఇందుకు రైతులు ఒక సంఘం గా ఏర్పడి వ్యవసాయ శాఖ నుండి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  ఈ సంఘానికి నాబార్డు ద్వారా, బ్యాంకు ద్వారా ఆర్థిక చేయూత  ఇచ్చి వాటిని బలోపేతం దిశగా నడిపించాలన్నారు.    ఇప్పటికే  మంజూరైన మక్తల్, మద్దూరు దమరగిద్ద  క్లస్టర్స్ వ్యాపారాలను  త్వరితగతిన అభివృద్ధి పరచాలని  కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో     నాబార్డ్ డీడీఎం షణ్ముఖ చారి. Ldm విజయకుమార్, జిల్లా అధికారులు జాన్ సుధాకర్, సురేఖ, వెంలటేశ్వర్లు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు

Share This Post