జిల్లాలో రైతులు యాసంగి లో వరి వేయొద్దని, ప్రత్యమ్నాయ పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు.

యాసంగికి వరి వద్దు – ప్రత్యామ్నాయ పంటలే ముద్దు … జిల్లా కలెక్టర్

జిల్లాలో రైతులు యాసంగి లో వరి వేయొద్దని, ప్రత్యమ్నాయ పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు.

సోమవారం కంది క్లస్టర్ రైతు వేదికలో యాసంగి సీజన్ 2021-22 పై సంగారెడ్డి, పటాన్చెరు క్లస్టర్ ల వ్యవసాయ శాఖ, ఏడిలు, ఏ ఈ ఓ ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
భారత ఆహార సంస్థ(FCI) వరిని కొనడం లేదని రైతులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. రైతులు ఎవరు నష్టపో వద్దన్నారు. యాసంగి లో కొనుగోళ్ళు ఉండవని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు.

జిల్లాలో రైతులు యాసంగి సీజన్ లో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, కంది, మినుము తదితర ఆరుతడి పంటల వైపు మళ్ళించాలన్నారు. భూముల లక్షణాలకు అనుగుణంగా ఏ పంటలు వేయాలో రైతులకు సూచించాలని తెలిపారు.

ప్రత్యమ్నాయ పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామాలలో మొత్తం రైతులు ఎంత మంది ఉన్నారు, వారు పండిస్తున్న పంటల వివరాలతో జాబితా తయారు చేయాలన్నారు.

వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ నెల 27 నుండి 29 వరకు
ప్రతి రైతు వేదికలో రైతులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎ.ఇ.ఓ లు రైతులకు అందుబాటులో ఉండి సాగులో వారికి తగిన సలహాలు, సూచనలు చేయాలన్నారు. క్షేత్ర స్థాయి వరకు ప్రతి రైతుకు ఎఫ్.సి.ఐ. వడ్లు కొనబొదన్న సమాచారం చేరాలని స్పష్టం చేశారు.
ఏ ఈ ఓ లు క్షేత్రస్థాయిలో పని చేయాలని, ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేరాలన్నారు. క్రాప్ వైజ్ గా రైతుల గ్రూప్ చేయాలని, అందులో సైంటిస్టులను చేర్చాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. రైతులను ఒప్పించి, ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చూడాలన్నారు. క్లస్టర్ వైజ్ గా ప్రతిపాదిత పంటల వివరాలతో ప్లాన్ సిద్ధం చేయాలని ఏ ఈ ఓ లకు ఆదేశించారు. రైతులకు ఆదాయం వచ్చే పంటలను వేయించాలని తెలిపారు.

యాసంగి లో విత్తన డీలర్లు వరి ధాన్యం విత్తనాలు అమ్మ వద్దని, అమ్మి నట్లయితే క్రిమినల్ కేసులు బుక్ చేసి, షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

అదేవిధంగా కూరగాయలు పండించేలా రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఉద్యానవన అధికారి సునీతకు సూచించారు.

జిల్లాలో గల 116 రైతు వేదికలకు 116 మంది వ్యవసాయేతర అధికారులను ప్రత్యేకించి నియమించాలని వ్యవసాయ శాఖ జె.డి కి సూచించారు.

సమావేశం లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు, ఉద్యాన శాఖ అధికారి సునీత, సీడ్స్ కార్పొరేషన్ ప్రతినిధి, వ్యవసాయ శాస్త్రవేత్త లు ,మండల ఎ.ఓ లు, ఏ ఈ ఓ లు,తదితరులు పాల్గొన్నారు.

Share This Post