జిల్లాలో రైతు పొలాల వద్ద కళ్లాల నిర్మాణపు పనులను వేగవంతం చేయాలి… జిల్లా కలెక్టర్ నిఖిల

జిల్లాలో ఆసక్తి గల రైతులను క్షేత్ర స్థాయిలో గుర్తించి లక్ష్యం మేరకు వారి పొలాల వద్ద కళ్లాల నిర్మాణం పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నర్సరీల నిర్వహణ, కళ్లాల నిర్మాణం, మరుగుదొడ్లు, వైకుంఠ దామల నిర్మాణాలకు సంబంధించిన చెల్లింపులపై ఎంపీడీఓ లు, ఎంపీవో లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని మండలాలలో లక్ష్యం మేరకు కళ్లాల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇందుకు గాను అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులను సంప్రదించి వరికి అవసరమైన ఇసుక, సిమెంట్ అందించి నిర్మాణాలు చేపట్టే విధంగా వారి సమ్మతి తీసుకోని పనులు వేగవంతం చేయాలని సూచించారు. అన్ని గ్రామ పంచాయతీలలోని నర్సరీలలో నాణ్యమైన ఎర్ర మట్టితో బ్యాగ్ ఫిల్లింగ్ పనులు చేపట్టాలని, ఇట్టి బాగులలో నాణ్యమైన విత్తనాలను విత్తలని సూచించారు. ఈసారి హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్ మాత్రమే చేపట్టాలని తెలిపారు. ఎంపీడీఓల పర్యవేక్షణలో ఈసారి ప్రతి ఇంటికి (06) మొక్కలు అందజేసి ఖాళీ స్థలంలో మొక్కలు స్వయంగా నటించాలని తెలిపారు. నమ మాత్రపు పనులు చేయకూడదని ఆదేశించారు. ప్రైవేట్ స్థలాలలో ఉన్న అన్ని నర్సరీలను వెంటనే ప్రభుత్వ స్థలాలకు మార్చాలన్నారు. ఇట్టి నర్సరీలకు ఫెన్సింగ్, గేట్, బోర్డు, నీటి సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మంజూరు అయిన మరుగుదొడ్లు, వైకుంఠ దామల నిర్మాణపు పనులకు సంబందించిన FTO లను ఆన్ – లైన్ లో వెంటనే అప్లోడ్ చేసి కాంట్రాక్టర్లకు డబ్బులు అందేలా చూడాలన్నారు. 90 శాంతం FTO లు వారం రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు వేదికలు, SWM షెడ్ల వద్ద పిచ్చి మొక్కలు పెరగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ఎంపీడీఓ లు ఇట్టి పనులను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారి.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ ) చంద్రయ్య, డిఆర్డిఓ కృష్ణన్, ఎంపీడీఓ లు, ఎంపీవో లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post