జిల్లాలో లే-అవుట్ల ఆమోదపు అనుమతులను నిర్ణీత గడువులోగా అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

జనవరి, 27 ఖమ్మం –

జిల్లాలో లే-అవుట్ల ఆమోదపు అనుమతులను నిర్ణీత గడువులోగా అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజా సమావేశ మందిరంలో జరిగిన డిస్ట్రిక్ట్ లేవల్ లే-అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశంలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ పరిధిలో లే-అవుట్ ఆమోదం కొరకై అందిన దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించి నిబంధనల మేరకు సమర్పించబడిన లేఅవుట్ల ఆమోదవు దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లే అవుట్ల ఆమోదం కోసం రెవెన్యూ, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు భవనాల టౌన్ ప్లానింగ్ తదితర అనుబంధ శాఖల నుండి అనుమతులకై సమర్పించిన దరఖాస్తులను 21 రోజుల లోపు ఆయా శాఖలకు సంబంధించిన అనుమతులను జారీచేయాలని, తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని కలెక్టర్ అనుబంధ శాఖల అధికారులకు సూచించారు. అనుమతుల జారీ సమయంలో సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన పిదపనే అనుమతులు జారీచేయాలని. కలెక్టర్ సూచించారు. లే-అవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల మేరకు చట్టబద్ధంగా సమగ్ర ప్రణాళికబద్దంగా ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. లే అవుట్ ఆమోదం కొరకు సమర్పించబడిన దరఖాస్తులను జిల్లాస్థాయి కమిటీ పరిశీలన అనంతరం ఆమోదించడం జరుగుతుందని ప్రతి నెలా జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఉంటుందని లే అవుట్ల ఆమోదం అనుమతులకై అందిన దరఖాస్తులను అనుబంధ శాఖల అధికారులు నిబంధనల మేరకు జాప్యం జరుగకుండా అనుమతులు జారీచేయాలని కలెక్టర్ తెలిపారు.

నగరపాలక సంస్థ కమీషనరు. సుడా వైస్ చైర్మన్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి అప్పారావు, ల్యాండ్ సర్వే ఎ.డి. రాము, రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు బి.లక్ష్మణ్, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీరు రమేష్, నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీరు యం.రవికుమార్, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాధ్, సూర్యనారాయణ, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపల్ కమీషనర్లు, లే-అవుట్ డెవలపర్స్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post