జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ నమోదుకు యంత్రాంగం కృషి చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

18 ఏళ్ళ పైబడిన వారందరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహించి అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 5 లక్షల 48 వేల 094  మంది అర్హులకు వ్యాక్సిన్ అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు 4 లక్షల 52 వేల 859 మందికి వ్యాక్సిన్ అందించడం జరిగిందని, ఇందులో 3 లక్షల 74 వేల 748 మందికి మొదటి డోస్(68.37%) , 78 వేల 111(80.73%) మందికి రెండవ డోస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు మొదటి డోస్ తీసుకొని రెండవ డోస్ తీసుకోని వారిని గుర్తించి వెంటనే వ్యాక్సిన్ తీసుకునే విధంగా ఆయా ప్రాంతాలలోని ఆశా, వైద్య సిబ్బంది, పంచాయితీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని అన్నారు. ఇప్పటివరకు బతుకమ్మ, దసరా, ఇతర పండగల నేపథ్యంలో కొంతమంది వ్యాక్సిన్ తీసుకోలేదని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీపావళి పండగ లోగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ దిశగా వందశాతం వ్యాక్సినేషన్ అందించిన జిల్లాగా కృషి చేయాలనీ ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలనీ ఆకాంక్షించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రతి వార్డులలో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకున్న వివరాలు నమోదుతో పాటు తీసుకోని వారి వివరాలు సేకరించి వెంటనే వారికీ వ్యాక్సిన్ అందించాలని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, మున్సిపల్, పంచాయితీ, రెవెన్యూ, వైద్య సిబ్బంది సహకారంతో వ్యాక్సినేషన్ పూర్తీ చేయాలని అన్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకునే విధంగా ఆయా శాఖాధిపతులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న వారి వివరాలు, జనన తేదీ, ఆధార్ నంబర్, వ్యాక్సిన్ మొదటి, రెండవ డోస్ వివరాలతో కూడిన నివేదిక ప్రతి శాఖ అధికారులు సమర్పించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఏ శాఖలోనైనా ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో సంబంధిత శాఖ అధికారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన పక్షంలో వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగి యొక్క అక్టోబర్ మాసం వేతనం నిలుపుదల చేయాలనీ సూచించారు. కనుక ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.

Share This Post