జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ రెండు డోసులు పూర్తి చేయాలి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి – మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ రెండు డోసులు పూర్తి చేయాలి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి – మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రెండు డోసుల కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుండి జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​‍లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ….

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ 100% రెండు డోసులు పూర్తి చేసేందుకు ప్రణాళికల బద్దంగా పూర్తిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

వ్యాక్సినేషన్‌ విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం తీసుకోవాలని మంత్రి కోరారు.

ప్రతి గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించి పల్లెల్లో పచ్చదనం పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

గ్రామాల్లో నిర్వహించే నర్సరీల్లో మొక్కల పెంపకం పై దృష్టి సారించాలని సూచించారు.

గ్రామాల్లో ఉపాధి హామీ పనులను జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కల్పించే బాధ్యతలు చేపట్టాలన్నారు.

ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలకు కరోన జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

నాగర్ కర్నూల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ మను చౌదరి, పిడి డిఆర్డిఎ నర్సింగ్ రావు, డి పి ఓ కృష్ణయ్య, జిల్లా పరిషత్ సీఈఓ భాగ్యలక్ష్మి, మండల స్థాయి లో నుండి ఎంపీడీవోలు, ఎంపీవోలు గ్రామ స్థాయి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Share This Post