జిల్లాలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించాలి : అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

పత్రికా ప్రకటన

తేది 12- 11- 2021

కరీంనగర్

జిల్లాలో వ0ద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించాలి .

అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్.
o0o

జిల్లాలో 18 సంవత్సరములు దాటిన వారందరికీ 100% వ్యాక్సినేషన్ చేయించాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. శుక్రవారం సాయంత్రం అందరూ మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోల లతో కోవిడ్ వ్యాక్సినేషన్, డెంగ్యూ నిర్మూలన పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి డోసు కోవిడ్ వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. మొదటి డోసు తీసుకున్న వారికి నిర్ణీత గడువులోగా రెండో రోజు వ్యాక్సిన్ వేసేలా చర్యలు గైకొనాలి అని ఆదేశించారు . గ్రామాలలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేయించాలని మెడికల్ ఆఫీసర్ లను ఆదేశించారు. ఏ. ఎన్. ఎం. లు ,ఆశ వర్కర్లు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి వెంటనే వారికి ఇంటివద్దనే వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో వార్డుల వారీగా క్యాంపులు నిర్వహించి వ్యాక్సినేషన్ వేయించాలని అన్నారు. గ్రామాలలో మొబైల్ వ్యాక్సినేషన్ టీములను పంపి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఏ. ఎన్ .ఎం కు రోజుకు 100 వ్యాక్సినేషన్ లు వేయుటకు టార్గెట్ గా నిర్ణయించాలని మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచుల సహకారంతో అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు .

గ్రామాలలో డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. డెంగ్యూ మలేరియా జ్వరాలు నివారణకు గ్రామాలలో స్ప్రేయింగ్ చేయించాలని , ప్రతి వారం వారం డ్రైడే నిర్వహించాలని సూచించారు. అన్ని గ్రామాలలో, పట్టణాలలో డెంగ్యూ మలేరియా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. జూవేరీయా, ఇమ్యునైజేషన్ అధికారి ని డాక్టర్ జావిదా ,జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య , మెడికల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ,తదితరులు పాల్గొన్నారు .

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్.

Share This Post