జిల్లాలో వన మహోత్సవం విజయవంతం పోచారం మున్సిపాలిటీ నారేపల్లిలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ హరీశ్.

పత్రిక ప్రకటన

తేదీ : 10–08–2022

జిల్లాలో వన మహోత్సవం విజయవంతం
పోచారం మున్సిపాలిటీ నారేపల్లిలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ హరీశ్
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం విజయవంతమైందని తెలిపినారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన మేరకు 75 మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఈ మేరకు బుధవారం వనమహోత్సవంలో భాగంగా జిల్లాలోని పోచారం మున్పిపాలిటీ పరిధిలోని నారేపల్లిలోని నందనవనం పార్కులో కలెక్టర్ హరీశ్ మొక్కలు నాటారు. , నందనవనం పార్కులో 750 మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ మేరకు వనమహోత్సవాన్ని ఈ రోజు నిర్వహించామని దీనిలో భాగంగా మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వనమహోత్సవం భాగంగా మొక్కలను నాటామని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలను నాటే విధంగా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీఎఫ్వో అశోక్కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లు, సీనియర్ సిటిజన్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post