జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైనవన్ని సంసిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                         తేది 29-11-2021

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైనవన్ని సంసిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

సోమవారం గద్వాల్ మండలం తుర్కొనిపల్లి, ముల్కలపల్లి , తెలుగోనిపల్లి , లత్తిపురం గ్రామాలలో డి.ఆర్.డి.ఎ ఆధ్వర్యం లో ఉన్న ఐ.కే.పి సెంటర్ లను జిల్లా ఎస్.పి రంజన్ రతన్ కుమార్ తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో టార్ఫలిన్లు, గన్ని బ్యాగులు, ప్యాడి క్లీనర్లు, తేమ శాతం గుర్తించే మెషిన్ లు, అన్ని సిద్ధంగా ఉంచాలని, పరికరాలు అన్ని పని చేస్తున్నాయో లేదో ముందే చెక్ చేసుకోవాలని అన్నారు. రైతుల ఫోన్ నెంబర్లకు తప్పనిసరిగా ఆదార్ లింక్ చేయాలనీ , తేమ శాతం 17% ను మించకుండా చూసుకోవాలని  తెలిపారు. ధాన్యం సేకరణ వివరాలను ఆన్లైన్ లో ఎలా చెక్ చేస్తున్నారని, రైతుల పాస్ బుక్ వివరాలను ఆన్లైన్ లో ఎంట్రీ చేస్తున్నారా, టోకెన్లు జారి చేశారా, ఆదార్ లింక్ చేశారా అని వివరాలను ఎ.ఈ.ఓ లను అడిగి తెలుసుకున్నారు. ఐ.కే.పి సెంటర్ లు మొత్తం ఎన్ని ఉన్నాయని , ధాన్యం ఎంత కొనుగోలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. టార్ఫలిన్లు, మోయిశ్చరైజెర్లు, గన్నిబ్యాగు లు కేంద్రాలలో పూర్తి స్థాయి లో అందుబాటులో ఉండేలా సెంటర్ ఇంచార్జ్ లు చూసుకోవాలని అన్నారు. విద్యుత్ కనెక్షన్లో  అంతరాయం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని  అన్నారు.

ఈ కార్యక్రమం లో డి.ఎస్.ఓ రేవతి, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్,  అసిస్టెంట్ డి.ఆర్.డి.ఎ సరోజ, ఏ ఇ ఓ  లు రవి, కీర్తి  , తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారిచే జారి చేయనైనది.

Share This Post