నల్గొండ,అక్టోబర్ 18. జిల్లాలో వానాకాలం సీజన్ లో వరి ధాన్యం సేకరణ కు సంబంధిత శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక తో ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు.సోమవారం
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో పౌర సరఫరాల శాఖ,మిల్లర్ లు,గ్రామీణాభివృద్ధి శాఖ,సహకార శాఖ,వ్యవసాయ శాఖ రవాణా శాఖ ల అధికారులతో వానాకాలం పంట సీజన్ లో ధాన్యం సేకరణ, రైతుల కు మద్దతు ధర లభించేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు పై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ లో దాన్యం సేకరణ,కొనుగోలు కు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా జి.ఓ.ఎం.ఎస్.నం.13, 16.10.21 న ఉత్తర్వులను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం వానాకాలం సీజన్ పంట కొనుగోళ్లు దృష్టి లో వుంచుకొని పకడ్బందీ గా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. యా సంగి సీజన్ లో జిల్లాలో అత్యధికంగా పంట దిగుబడి వచ్చిందని, కోవిడ్,లాక్ డౌన్ ఉన్నప్పటికీ జిల్లాలో రాష్ట్రం లోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించినట్లు తెలిపారు.వానాకాలం సీజన్ కు ఐ. కె.పి. ద్వారా 87,సహకార శాఖ పి.ఏ.సి.ఎస్ ద్వారా80,మార్కెటింగ్ శాఖ ద్వారా 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కు ఆయా శాఖల అధికారులు పూర్తి ఏర్పాట్లు తో సమాయత్తం గా ఉన్నట్లు తెలిపారు.కొనుగోలు కేంద్రాలు ఎత్తైన ప్రాంతాలలో వర్షపు నీరు నిల్వ లేకుండా ఉండేలా ఏర్పాటు చేయాలని,ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల మేరకు మాత్రమే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దాన్యం కొనుగోలు చేయాలని,కేంద్రాల ఇంచార్జి లు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.గ్రేడ్ ‘ఏ’ ధాన్యానికి 1960 రూ.లు,సాధారణ రకానికి 1940 రూ.లు మద్దతు ధర నాణ్యతా ప్రమాణాలు పాటించి న దాన్యంకు చెల్లించడం జరుగుతుందని అన్నారు. తూకం యంత్రాలు, టార్పాలిన్ లు సమస్య లేకుండా చూడాలని పౌర సరఫరాల డి.యం.,మార్కెటింగ్, రవాణా శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. పౌర సరఫరాల సంస్థ గన్ని బ్యాగ్ లు సరఫరా,,రవాణా,పౌర సరఫరాల సంస్థ రవాణా కు లారీలు ఏర్పాటు,చేయాలని అన్నారు.తూకం యంత్రాలు తూనికలు కొలతల శాఖ సీల్ వేయాలని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించి ఆరబెట్టి,తాలు లేకుండా,నిర్ణీత తేమ శాతం తో దాన్యం తీసుకు వచ్చేలా రైతు లని చైతన్య వంతం చేయాలని అన్నారు. క్రమ పద్ధతి,ట్రాన్స్ప రెంట్ గా టోకెన్ లు జారీ చేసి కొనుగోలు చేయాలని తెలిపారు.
ఈ సమావేశం లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని
జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,జిల్లా సహకార అధికారి ప్రసాద్,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యా నందం,రవాణా శాఖ అధికారి సురేష్ రెడ్డి,మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, తూనికలు,కొలతలు శాఖ ఇన్స్పెక్టర్ రామకృష్ణ,
మిల్లర్ లు తదితరులు పాల్గొన్నారు.


