జిల్లాలో వానా కాలం పంట సీజన్ కు గాను రూ. 355 కోట్లు రైతుబంధును జిల్లా రైతాంగానికి అందించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 15 ఖమ్మం:

జిల్లాలో వానా కాలం పంట సీజన్ కు గాను రూ. 355 కోట్లు రైతుబంధును జిల్లా రైతాంగానికి అందించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. వైరా నియోజకవర్గం ఏన్కూరు మండలంలో ఆదివారం రైతువేదికలను వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములునాయక్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఏన్కూరు మండల కేంద్రంలో 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతువేదికను 4.84 లక్షల వ్యయంతో నిర్మించిన వల్లె ప్రకృతి వనాన్ని అదేవిధంగా ఏన్కూరు మండలం తిమ్మరావు పేటలో మరో 22 లక్షలతో నిర్మించిన రైతువేదికను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిమ్మరావు పేట రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పైచిలుకు రైతువేదికల నిర్మాణాల్లో భాగంగా మన జిల్లాలో 129 క్లస్టర్లలో రైతువేదికలను నిర్మించుకున్నామని, వ్యవసాయానుబంధ రంగాలలో రైతులకు ఆధునిక పద్ధతులు, మెళకువలను రైతునేదికల ద్వారా అందించేందుకు ప్రతి రైతువేదికలో వ్యవసాయ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు రైతు సదస్సులు ఏర్పాటు చేసి రైతులు అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు నూతన వ్యవసాయ పద్ధతులు, విత్తనాలు, ఎరువులు వాడకం, పంట ఉత్పత్తుల విక్రయాలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించి చైతన్యపర్చే కార్యక్రమాలు నిరంతరాయంగా రైతువేదికల ద్వారా జరగాలని మంత్రి వ్యవసాయాధికారులను ఆదేశించారు. రైతాంగం సంక్షేమంతో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను ఖర్చు చేస్తుందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న పథకాలను గౌరవ ముఖ్యమంత్రివర్యులు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా, వానాకాలం యాసంగి పంటలకు రైతు పెట్టుబడి, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రమాద వశాత్తు చనిపోయిన రైతులకు 5 లక్షల రైతుభీమా ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలిపారు. దీనితో పాటు దళిత సాధికారత, ఆర్ధిక స్వావలంభనకై శ్రీకారం చుట్టిన దళితబంధు ద్వారా నిర్మాణాత్మకంగా పేదరికాన్ని దూరం చేసే పథకాలను ముఖ్యమంత్రివర్యులు వినూత్న ఆలోచనలతో అములులోకి తెచ్చారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామ స్వరూపాలు మారాయని ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరుస్తుందని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందుతుందని, మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధరణతో జిల్లాలో చెరువులన్నీ అలుగుపారుతున్నాయని మత్స్య సంపద, గొర్రెల సంపద ద్వారా బడుగు బలహీన వర్గాలతో పాటు రైతాంగం సుభిక్షంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములునాయక్ మాట్లాడుతూ రైతువేదికలు పరిశోధన కేంద్రాలుగా, రైతు గ్రంథాలయాలుగా వ్యవసాయానుబంధ రంగాలలో రైతులను చైతన్యపర్చే దిశగా ఉపయోగపడుతున్నా యన్నారు. పంటసాగులో మెళకువలు పాటించి వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించడం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించి ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు రైతువేదికలను సద్వినియోగపర్చుకోవాలని ఆయన కోరారు.

అదనపు కలెక్టర్ ఎన్ మధుసూథన్, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డి.సి.సి.బి. చైర్మన్: కూరాకుల నాగభూషణం, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఏన్కూరు ఎం.పి.పి. ఆర్. ఎం. వరలక్ష్మి, జడ్పీటిసి బదావత్ బుజ్జి, సర్పంచ్ చిత్రా రుక్మిణి, మండల రైతుబంధు సమితి కన్వినర్ మెడా ధర్మారావు, తిమ్మరావుపేట ఎం.పి.టి.సి గుగులోతు లచ్చిరాం, సర్పంచ్ ఆర్ ఎం. సుహాసినీ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీమతి విజయనిర్మల, మండల వ్యవసాయ శాఖాధికారి నర్సింహారావు, ఏన్కూరు తహశీల్దారు ఖాసీం, ఎం.పి.డి.ఓ, ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post