జిల్లాలో విజయవంతగా ధరణి అమలు:జిల్లా కలెక్టర్ బి .గోపి

దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోందని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు.

శుక్రవారంతో ధరణి పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకున్న సందర్బంగా మండల తహసీల్దార్ లతో, ధరణి సేల్ కి సంబందించిన సెక్షన్ అధికారులతో కలెక్టర్ కాన్ఫెరెన్స్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు .

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29 2020న ప్రారంభించారన్నారు.

ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేకుండా ,ట్యాంపర్ ప్రూఫ్ గా ఉండి వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ అని కలెక్టర్ తెలిపారు.

భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందన్నారు .

ధరణి ని సమర్థవంతంగా అమలు చేయడంలో పాలుపంచుకుంటున్న జిల్లాలోని సహచర అధికారులు, తహసీల్దార్లు, మండల అధికారులను అభినందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ విషయంలో తమ పూర్తి సహాయ, సహకారాలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని అందింస్తున్న రాష్ట్ర స్థాయి అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.

ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయని…. .గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవని అప్పుడు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండేవి కావని… ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు .

భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయన్నారు

ధరణి ప్రారంభానికి ముందు దీనికి గంటలు, గంటల సమయం పట్టేదని. . గతంలో తక్కువ గా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకై ఎంతో మంది వేచి ఉండే పరిస్థితులు సర్వ సాధారణంగా ఉండేవన్నారు

టాంపర్ ప్రూఫ్ తో పాటు…. పౌరులకు అనువుగా ఉండడం. తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం ధరణి లో ఉందన్నారు

పారదర్శకత తో పాటు ఆ ధునిక సాంకేతికత వినియోగం.. వివక్షకు తావులేకుండా ఉండడం,అతితక్కువగా అధికారుల జోక్యం లాంటి ఎన్నో ప్రత్యేకత లు ధరణి లో ఉన్నాయన్నారు .

అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం. … బయో మెట్రిక్ నిర్ధారణ. .. ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ నిర్దారణ…రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్, రీ జిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తామ్ ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం, ఆన్లైన్ చెల్లింపులు, అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ, పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం బట్వాడా, నిషేదిత భూములకు ఆటో-లాక్ విధానం మొదలగునవి ధరణి నిర్వహణా ప్రత్యేకతలని కలెక్టర్ తెలియజేసారు.

నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకతాని… ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయన్నారు .

జిల్లాలో 31మాడ్యూల్స్ ద్వారా జరిగిన ధరణి లావాదేవీలు 16752.

విక్రయాలు : 7874
గిఫ్ట్ డీడ్ : 3520
వారసత్వం :1075
తనఖా : 1798

*జిల్లాలో పరిష్కరించబడిన ఫిర్యాదుల వివరాలు * 8540

పెండింగ్ మ్యుటేషన్లు. : 2689
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 3495
నిషేధించబడిన జాబితా : 841
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 299

అని జిల్లా ధరణి పోర్టల్ కి సంబందించిన వివరాల్ని కలెక్టర్ వివరించారు .

నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గాను గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరిని కలెక్టర్ కోరారు .

ఈ సమావేశం లో అడిషినల్ కలెక్టర్ హరి సింగ్, rdo లు మహేందర్ జి, పవన్ కుమార్, ఏవో రాజేంద్రనాథ్ తహసీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post