slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

జిల్లాలో విద్యా, గృహ రుణాలతో పాటు స్వయం ఉపాధి రుణాలు లక్ష్యం మేరకు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష బ్యాంకర్లను ఆదేశించారు. – Information and Public Relations Department, Government of Telangana

జిల్లాలో విద్యా, గృహ రుణాలతో పాటు స్వయం ఉపాధి రుణాలు లక్ష్యం మేరకు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష బ్యాంకర్లను ఆదేశించారు.

జిల్లాలో విద్యా, గృహ రుణాలతో పాటు స్వయం ఉపాధి రుణాలు లక్ష్యం మేరకు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రిహర్ష బ్యాంకర్లను ఆదేశించారు.  మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిలా స్థాయి సమన్వయ, సంప్రదింపుల సమావేశం నిర్వహింబిచారు.  ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ఆయా బ్యాంకుల పని తీరు, ఇచ్చిన రుణాలు, మొండి బకాయిల వివరాల పై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలో లక్ష్యం సాధించలేకపోతున్నారని అందుకు కారణాలు ఏంటని ప్రశ్నించారు.  ముద్రా రుణాలు, ప్రధానమంత్రి స్వనిది, పి.యం.ఈ.జి.పి వంటి సబ్సిడీ రుణాలు ఆశించిన స్తాయిలో  గ్రౌండింగ్ కావడం లేదన్నారు.  వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి వారికి రుణం ఇవ్వడమా లేక తిరస్కరించడమా అనేది త్వరగా జరగాలని అంతేతప్ప బ్యాంకు చుట్టు తిప్పుకోవద్దని సుచించారు.  డైరీ, పౌల్ట్రీ,పోర్ట్ఫిడ్ రైస్ వంటి స్వయం ఉపాధికి బ్యాంకర్లు, సంబంధిత జిల్లా అధికారులు సమన్వయం తో పనిచేసి నిరుద్యోగ యువతకు రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించాలని సూచించారు.  గృహ రుణాలు, విద్యా రుణాలు చాలా తక్కువ ఉన్నాయని ఇందుకు కారణాలు ఏంటని ప్రశ్నించారు.  ఇందుకు ఎస్.బి.ఐ. అధికారి స్పందిస్తూ చిన్న చిన్న క్రాప్ లోన్ లు సకాలం లో చెల్లించలేకపోవడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ తగ్గిపోతుందని తద్వారా పెద్ద రుణాలు పొందలేక పోతున్నారని సమస్యను  కలెక్టర్ కు వివరించారు.  గ్రామీణ   స్వయం సహాయక సంఘాలకు రుణాలు గ్రౌండింగ్ అవుతున్నప్పటికి పట్టణ స్థాయిలోని మహిళా సంఘాలకు రుణాలు గ్రౌండింగ్ చేయలేక పోతున్నారని పేర్కొన్నారు.  జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు ఈ సంవత్సరం రుణాలు  ఇప్పటి వరకు 160 కోట్లు  గ్రౌండింగ్ అయ్యాయని రాబోయే 4 నెలల్లో ఇంకా 130 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు గ్రౌండింగ్ చేయాల్సి ఉందన్నారు.  కొన్ని బ్యాంకులు మహిళా సంఘాల రుణాలు  10 శాతం తమ బ్యాంకులో సెక్యూరిటీ డిపాజిట్ లేదా  జమ ఖాతాలో ఉంచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం అన్నారు.  ఎట్టి పరిస్థితిలోనూ 10 శాతం రుణం  తమ వద్ద డిపాజిట్ చేసుకోవద్దని బ్యాంకర్లను ఆదేశించారు. ఆదేవిధంగా మహిళా సంఘాల ప్రతినిధులు బ్యాంకుకు వచ్చి రోజంతా బ్యాంకు వద్ద కూర్చోబెట్టుకోకుండా వారికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించి ఆ సమయంలోనే వాళ్ళ దరఖాస్తులు, సమస్యలు పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను సూచించారు.  మహబూబ్ నగర్ లో ఉన్న RSETI లో జిల్లా నుండి నిరుద్యోగ యువతకు నైపున శిక్షణ ఇప్పించి  ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామీణాభివృద్ధి శాఖ, పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో నాబార్డ్ అధికారి శ్రీనివాస్,  జిల్లా అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్,  ఆర్బీఐ అధికారి, ఎస్.బి.ఐ అధికారి, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post