జిల్లాలో వివిధ దశలలో నిర్మాణం లో ఉన్న వైకుంఠ దామం లను అక్టోబర్ 10 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.

 నల్గొండ అక్టొబర్ 1. జిల్లాలో వివిధ దశలలో నిర్మాణం లో  ఉన్న వైకుంఠ దామం లను అక్టోబర్ 10 లోగా  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో    ఎం.పి. డి.ఓ.లు. పంచాయతీ రాజ్ ఏ.ఈ , డి.ఈ.లతో
 జిల్లాలో  వైకుంఠ దామం ల నిర్మాణ పనుల ప్రగతి పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ దామం ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని,నిర్మాణం లో చిన్న చిన్న పెండింగ్ పనులు పూర్తి చేసి వంద శాతం నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు.జిల్లా వ్యాప్తంగా మిర్యాల గూడ డివిజన్,దేవర కొండ డివిజన్,నల్గొండ డివిజన్ మండలం ల వారీ గా పనులు ప్రగతి,సమస్యలు పై చర్చించి సూచనలు చేశారు.  నిర్మాణ పనులువైకుంఠ ధామం లు నిర్మాణం తొ పాటు                పనులు ప్రగతి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు.వైకుంఠం దామాలు    నిర్మానమునకు కావలసిన నిధులు సమకురుస్తామని తెలిపారు .ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,,జడ్పీ సి.ఈ.ఓ.వీర బ్రహ్మచారి,డి.పి.ఓ విష్ణువర్ధన్, మిర్యాలగూడ డివిజన్ పి.ఆర్.ఈ. ఈ. మాధవి తదితరులు పాల్గొన్నారు.

Share This Post