జిల్లాలో వివిధ దశలలో నిర్మాణం లో ఉన్న వైకుంఠ దామం లను అక్టోబర్ 10 లోగా పూర్తి చేయాలని : జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్గొండ,సెప్టెంబర్ 24. జిల్లాలో వివిధ దశలలో నిర్మాణం లో ఉన్న వైకుంఠ దామం లను అక్టోబర్ 10 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఎం.పి. డి.ఓ.లు,పి.ఆర్.ఏ.ఈ. లతో జిల్లాలో  వైకుంఠ దామం ల నిర్మాణ ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ దామం ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు.జిల్లా వ్యాప్తంగా మిర్యాల గూడ డివిజన్,దేవర కొండ డివిజన్,నల్గొండ డివిజన్ మండలం ల వారీ గా పనులు ప్రగతి,భూ సమస్యలు సమీక్షించారు.రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ప్రగతి తో పోల్చి చుస్తే నల్గొండ జిల్లా వెనుక బడి ఉందని ఆయన అన్నారు.వైకుంఠ దామం ల నిర్మాణ పనులు పూర్తి చేయడం తో పాటు పనులు ప్రగతి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు.ఇసుక సమస్య ఉంటే తహశీల్దార్ దృష్టి కి తీసుకు రావాలని అన్నారు.ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,డి.ఆర్.డి.ఓ.కాళిందిని,జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి, మిర్యాలగూడ డివిజన్ పి.ఆర్.ఈ. ఈ. మాధవి తదితరులు పాల్గొన్నారు.

Share This Post