జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

అక్టోబర,04, ఖమ్మం:

జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన “గ్రీవెన్స్ డే” సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులు, గ్రీవెన్స్ పెండింగ్ కేసులపై తీసుకున్న చర్యలను శాఖలవారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లా అధికారులు తమ శాఖకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులపై కౌంటరు ధాఖలు చేసి తీసుకున్న చర్యలను సత్వరమే తెలియజేయాలని, అదేవిధంగా జిల్లా అధికారులు పరిధిలో గల, డివిజన్, మండల స్థాయి అధికారులకు సంబంధించి కోర్టు కేసులపై కూడా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ కేసులకు కౌంటర్ దాఖలు చేయడంతో పాటు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల అమలుపై తీసుకున్న చర్యలను సత్వరమే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

సోమవారం ” గ్రీవెన్స్ డే”కు డబుల్ బెడ్రూమ్ గృహాల కేటాయింపులపై ప్రజలు అధికంగా తమ అర్జీలను సమర్పించారు. ఖమ్మం నగరం మోమీనాన్ బజార్ నుండి వచ్చిన యం.డి.నశ్రీన్, ఎస్.కె. నయిమ్, షేక్, షమీమ్, అదేవిధంగా కారెపల్లి నుండి వచ్చిన తిరునగరి లక్ష్మణసూరీ, డబుల్ బెడ్రూమ్ గృహాలను కేటాయించగలరని తమ అర్జీలను కలెక్టర్ కు సమర్పించారు. అట్టి అర్జీలను పరిశీలన చేసి తగు చర్యలకై సంబంధిత జిల్లా అధికారులకు కలెక్టర్ సూచించారు. వైరా మండలం పూసలపాడు నుండి వచ్చిన ఉప్పల -నర్సయ్య, తన సర్వే నెం. 40 లో గల భూమని 2020-21 సంవత్సరానికి రైతుబంధు రాలేదని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య గైకొనాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలం సు బ్లేడ్ నుండి వచ్చిన టి అమృతమ్మ తాను భోదకాలు కలిగియున్నానని తనకు వికలాంగుల కోటా కింద పెన్షన్ మంజూరు చేయగలరని సమర్పించిన అర్జీని తగు చర్యకై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. తల్లాడ మండలం గోపాల పేట నుండి వచ్చిన జమ్ముల రామ చంద్రారెడ్డి, తనకు సర్వే నెం.90 లో గల ఐదు ఎకరాల భూమికి నూతన పాస్ పుస్తకము ఇప్పటివరకు రాలేదని సమర్పించిన అర్జీను పరిశీలన చేసి తగు చర్యకై తహశీల్దారుకు సూచించారు. నగరంలోని రాజీవ్ స్వగృహాలను అర్హులైన వారికి ఇవ్వాలని ఖమ్మం డివిజన్ సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ వారు సమర్పించిన అర్జీని తదుపరి చర్యకై జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. ఖమ్మం నగరం ముస్తఫానగర్ నుండి వచ్చిన గోకర ఉజ్వల, తన భర్త జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో డెటా ఆపరేటర్ గా పనిచేస్తూ 2018లో మరణించారని, ఇప్పటివరకు తనకు ఉద్యోగం కల్పించలేదని సమర్పించిన అర్జీను పరిశీలించి సత్వర చర్యకై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. తల్లాడ మండలం పినపాక గ్రామ యువకులు తమ గ్రామంలో గ్రంథాలయం కొరకు స్థలం కేటాయించగలరని సమర్పించిన అర్జీని తగు చర్యకై గ్రంథాలయ కార్యదర్శికి సూచించారు. ఖమ్మం నగరం పంపింగ్ వెల్ రోడకు చెందిన బి. కుమారి తన భర్త 72 శాతం వికలాంగత్వం కలిగి ఉన్నారని తాను ఎటువంటి జీవనోపాధి చేయలేని పరిస్థితిలో ఉన్నానని తనకు అంగన్వాడీ ఆయా పోస్టు ఇప్పించగలరని సమర్పించిన అర్జీని తదుపరి చర్యకై జిల్లా సంక్షేమ శాఖాధికారికి సూచించారు. ఎర్రుపాలెం మండలం సత్యనారాయణ పురం గ్రామ ప్రజలు తమ గ్రామంలో గ్రావెల్ మెటల్ రోడ్డు ఏర్పాటు చేయగలరని సమర్పించిన అర్జీని తగు చర్యకై జిల్లా పంచాయితీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

“గ్రీవెన్స్ డే”లో అదనపు కలెక్టర్ మధుసూధన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post