జిల్లాలో వివిధ శాఖల పెండింగ్ కోర్టు కేసులపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం “గ్రీవెన్స్ డే” సందర్భంగా వివిధ శాఖలలోని పెండింగ్ కోర్టుకేసులు, పరిష్కృతి పెండింగ్ దరఖాస్తులపై తీసుకున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 30 ఖమ్మం:

జిల్లాలో వివిధ శాఖల పెండింగ్ కోర్టు కేసులపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం “గ్రీవెన్స్ డే” సందర్భంగా వివిధ శాఖలలోని పెండింగ్ కోర్టుకేసులు, పరిష్కృతి పెండింగ్ దరఖాస్తులపై తీసుకున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించిన అంశాలపై వెంటనే కౌంటర్ దాఖలు చేసి అట్టి సమాచారాన్ని జిల్లా లీగల్ సెల్లో అప్లోడ్ చేయాలని, ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన అధికారులు కూడా లీగల్ సెల్లో నివేదికను ఆధునీకరించుకోవాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రతి సోమవారం ప్రజల నుండి అందుతున్న అర్జీలపై సత్వర చర్యలు ఉండాలని, ప్రతి వారం అర్జీల పరిష్కారంపై పురోగతి ఉండాలని సమస్య పరిష్కార స్వభావాన్ని అర్జీదారునికి తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల స్థాయిలో తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు ఇతర అధికారులకు సంబంధించిన అర్జీలపై సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, ఒకే సమస్యలపై పలు మార్లు అర్జీలు అందకుండా పరిష్కార స్వభావం సత్వరమే ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి నుండి వచ్చిన గుండమాల కాంతమ్మ తన భర్త పేరున సర్వేనెం. 200/ 29లో 31 కుంటల భూమి కలదని, 2012లో తన భర్త మరణించారని, ధరణీలో తన పేరు వస్తున్నప్పటికి అట్టి భూమికి సంబంధించిన పాస్  బుక్ జారీ చేయబడలేదని తన పేర పాస్  బుక్ జారీచేయగలరని సమర్పించిన దరఖాస్తును విచారించి తదుపరి చర్య తీసుకోవాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొణిజర్ల మండలం రామచంద్రాపురంకు చెందిన వి. వెంకటేశ్వర్లు తనకు సర్వేనెం 228/229లో గల భూమి ఆక్రమణకు గురైందని తనకు న్యాయం చేకూర్చగలరని సమర్పించిన అర్జీపై పరిశీలన చేసి తగు చర్యగైకొనాలని సంబంధిత తహశీల్దారును కలెక్టర్ ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం నుండి వచ్చిన వడ్లకుంట వెంకటేశ్వరరావు తాను 10వ తరగతి ఎస్సీ హాస్టల్లో చదివానని, తనకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ అడ్మిషన్ కూడా సాంఘీక సంక్షేమ కళాశాలలో ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తదుపరి చర్యకై రీజినల్ కో-ఆర్డినేటర్ ను ఆదేశించారు. ఖమ్మం నగరం శ్రీనివాసనగర్ నుండి వచ్చిన పి. సరస్వతి రూరల్ మండలంలోని సర్వేనెం. 745/ అ లో గల తమ స్థలంలో తమ అనుమతి లేకుండా విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ వేశారని, అట్టి దానిని తొలగించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. సింగరేణి మండలం చిన్నమడెంపల్లికు చెందిన యం మంగమ్మ తనకు స్వయం ఉపాధి పథకం కింద టెంట్ హౌజ్ కు బ్యాంకు ఋణం మంజూరులో జాప్యం జరిగిందని విచారణ చేసి ఋణం మంజూరు చేయగలరని సమర్పించిన అర్జీని తదుపరి చర్యకై లీడ్ బ్యాంక్ మేనేజర్ను కలెక్టర్ ఆదేశించారు. కామేపల్లి మండలం బర్లగూడెం రైతులు తమ గ్రామంలోని ఎత్తిపోతల పథకానికి మరమ్మత్తులు చేయించి తమ వ్యవసాయానికి సాగునీటి సదుపాయం కల్పించగలరని, అదేవిధంగా కూసుమంచి మండలం ముత్యాలగూడెం కు చెందిన యస్. శేషగిరి తన సర్వేనెం. 379లో గల పంట పోలాల్లో చెరువు అలుగువల్ల వరదనీరు చేరి పంటనష్టం జరుగుచున్నదని సమర్పించిన అర్జీపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సత్వర చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సింగరేణి మండలం చీమలపాడుకు చెందిన ఏ. రాఘవులు తాను గత 31 సంవత్సరాలుగా పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్నానని, తనను అక్రమంగా విధుల నుండి తొలగించారని, తనకు తగు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తుపై విచారణ చేసి తగు చర్య తీసుకోవాలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు “గ్రీవెన్స్ డే”లో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post