జిల్లాలో వ్యవసాయ క్షేత్ర విభాగాల భావన-నిర్ధారణ ప్రాజెక్ట్ ను లాంఛనంగా ప్రారంభించిన వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లోని 17 గ్రామాల ఎంపిక

జిల్లాలో వ్యవసాయ క్షేత్ర విభాగాల భావన-నిర్ధారణ ప్రాజెక్ట్ ను లాంఛనంగా ప్రారంభించిన వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు

పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లోని 17 గ్రామాల ఎంపిక

క్షేత్రస్థాయిలో భూకమతాల, విభజన మార్కింగ్ పై ఏ ఈ ఓ లు, రైతులకు అవగాహన కల్పించిన అధికారులు

భూకమతాల మార్కింగ్ అన్నది పంటల నమోదు కోసం మాత్రమేనని వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు పేర్కొన్నారు.

మంగళవారం సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ క్షేత్ర విభాగాల భావన-నిర్ధారణ ప్రాజెక్ట్ ను సదాశివపేట మండలం ఎల్లారం నాగులపల్లి గ్రామాలలో వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు లాంఛనంగా ప్రారంభించారు.

గూగుల్ సంస్థ వారి సహకారంతో
పంటల నమోదు కార్యక్రమంలో లోటుపాట్లను అధిగమించి భూకమతాల ను విభజించడం ద్వారా ఖచ్చితమైన పంటల నమోదు చేయడం కోసం సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ క్షేత్ర విభాగాల భావన-నిర్ధారణ (proof of concept project on field segmentation) ప్రాజెక్టును తొలిసారిగా క్షేత్రస్థాయిలో నిర్వహించారు.

ఈ ప్రాజెక్టు కొరకు సంగారెడ్డి మెదక్ మహబూబాబాద్ జిల్లాలలోని 17 గ్రామాలను ఎంపిక చేసినట్లు రఘునందన్ రావు తెలిపారు. అందులో సంగారెడ్డి జిల్లాలో 8 గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు.

17 గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులు అందరికీ జిల్లాలోని సదాశివపేట మండలం ఎల్లారం, నాగులపల్లి గ్రామాలలో భూకమతాల ను ఏ విధంగా గూగుల్ సంస్థ వారి సహకారంతో విభజించి మార్కింగ్ చేయాలో వివరించారు.

రెండు గ్రామాల రైతులతో పంటల నమోదు లో ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూకమతాల మార్కింగ్ పంట నమోదు కోసం మాత్రమేనని , పంటల నమోదు లో ఎదురయ్యే సమస్యలకు ఏ విధంగా భూకమతాల ను విభజించి మార్కింగ్ చేయవచ్చన్నది ” గ్రౌండ్ ” యాప్ ద్వారా వివరించారు.

భూ కమతాలు/వ్యవసాయ క్షేత్రాలను గూగుల్ ఎర్త్ మ్యాప్స్ తో అనుసంధానించడం వల్ల ఆయా క్షేత్రాలలో ఏ ఏ పంటలు వేస్తున్నారు, పంటలపై ఉన్న చీడపీడలు, పంట ఎంత దిగుబడి వస్తుంది అన్న పూర్తి వివరాలను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులు, ఏ ఈ ఓ ల తో సమావేశం నిర్వహించి భూకమతాలను ఆన్లైన్ చేయడంలో వచ్చే సమస్యలను అధిగమించడం పై గూగుల్ సంస్థ వారు నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, గూగుల్ సంస్థ సిబ్బంది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ శ్రీమతి రమాదేవి, జిల్లా వ్యవసాయ శాఖ జె.డి నరసింహారావు, ఏ డి ఏ లు, ఏ ఈ ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post