జిల్లాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలి : జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

జిల్లాలో 18 నం॥లు నిండిన ప్రతి ఒక్కరికి అందిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డైవ్‌ కార్యక్రమానికి మైనారిటీ మత పెద్దలు నహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని, జిల్లా అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో ఆసిఫాబాద్‌ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై మైనారిటీ మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సoదర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ కొవిడ్‌ -19 వైరన్‌ వ్యాప్తి వ్యాక్సినేషన్‌ ద్వారా నియంత్రించవచ్చని, 18 నం॥లు నిండిన ప్రతి ఒక్కరు ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్‌ తీనుకోవాలని, సాధారణ జీవితం గడపడానికి వ్యాక్సినేషన్‌ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిబంధనలతో పాటు వాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా నియంత్రించవచ్చని, అర్హత గల ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ రెండు డోసులు అందించేందుకు ‘అధికారుల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ఖబ్రస్తాన్ సoబంధించిన న్ధలాన్ని గతంలో చేపల మార్కెట్‌కు కేటాయించడం జరిగిందని, తమకు ఎక్కడైనా 5 ఎకరాల న్ధలం కేటాయించాలని మత పెద్దలు కోరగా త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ మత పెద్దలు ఉబేద్‌ హొబిన్‌ యహియా, నలీం బేగ్‌, ముబీద్‌, షాహిద్‌, మైనారిటీ
నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post