జిల్లాలో శాఖల వారిగా 2014-15, నుండి 2020-21 సంవత్సరం వరకు ఉన్న ఆడిట్ అభ్యంతరాలకు సంబంధించిన ప్రత్యుత్తరాలను రాష్ట్ర ఆడిట్ శాఖ కు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రిక ప్రకటన                                             తేది:19-01-2022

జిల్లాలో శాఖల వారిగా 2014-15, నుండి 2020-21 సంవత్సరం వరకు ఉన్న ఆడిట్  అభ్యంతరాలకు సంబంధించిన ప్రత్యుత్తరాలను  రాష్ట్ర ఆడిట్ శాఖ కు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, ఎంపిఓ లతో ఏర్పాటు చేసిన ఆడిట్ అభ్యంతరాలకు సంబంధించిన జిల్లా స్థాయి కో ఆర్డినేషన్ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ 2014-15, నుండి 2020-21, వరకు జిల్లాకు సంబంధించిన రాష్ర్ట ఆడిట్ శాఖ వారూ ఇచ్చిన రిపోర్ట్ లో పేర్కొనబడిన అభ్యంతరాల వివరాలను తెలిపారు. జిల్లాలో మొత్తం 34,197 అభ్యంతరాలు ఉన్నాయని, జిల్లా పరిషత్ లో 23, జిల్లా మండల ప్రజా పరిషత్ లో 1050, గ్రామ పంచాయతిలో 31,927, జిల్లా గ్రంథాలయ సంస్థ లో 44, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లో 154, నియోజిక వర్గ అభివృద్ధి పథకం కింద  75 , నాలుగు మున్సిపాలిటీ ల పరిధిలో 904, అభ్యంతరాలు ఉన్నాయని, వీటన్నింటికి త్వరితగతిన రిప్లై ఇచ్చి తగు ఆధారాలతో సహా రాష్ట్ర ఆడిట్ శాఖకు పంపించాలని తెలిపారు.

శాఖల వారిగా ఉన్న ఆడిట్ అభ్యంతరాలను రెండు వారాలలోగా రాష్ట్ర ఆడిట్ శాఖ కు సమర్పించాలని, శాఖల వారిగా ఉన్న అభ్యంతరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీల, పంచాయతి సెక్రటరీల, పరిధిలో ఉన్న ఆడిట్ అభ్యంతరాలకు రిప్లై ఆధారాలతో సమర్పించాలని  అన్నారు. ఎ సమస్య వచ్చిన ఆడిట్ అధికారి దృష్టికి తిసుకేల్లాలని అధికారులకు ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతిల వారిగా అభ్యంతరాల వివరాల పై సమీక్షించారు. అన్ని మండలాల ఎంపిడిఓ లు, ఎంపిఓ లు వారి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం లో పాల్గొన్నారు.

అనంతరం జిల్లాలో కరోనా నియంత్రణ, కరోనా వాక్సినేషన్ పై మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, ఎంపిఓ లతో సమీక్షించారు. మండలాల్లో ఉన్న 15-18 సంవత్సరాల వయస్సు పిల్లలకు 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలనీ అన్నారు. విద్యా సంస్థలకు సెలవులు ఉన్నందున పిల్లలందరు ఇళ్ళలో ఉంటారని  ఆశా, ఎ.ఎన్ఎం లు ఇంటింటికి తిరిగి తప్పనిసరిగా వాక్సిన్ వేయాలని అన్నారు. రెండవ డోస్ వాక్సినేషన్ కుడా 100 శాతం పూర్తి చేయాలనీ, ఓమిక్రాన్ మరియు కరోనా పై ప్రజల్లో అవగాహన కల్పించాలని , ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి బౌతిక దూరం పాటించేలా చుడాలని అన్నారు. మార్కెట్లో ప్రజలు గుంపులు గుంపులు గా ఉండకుండా తప్పనిసరిగా బౌతిక దూరం పాటించేలా చూడాలని అన్నారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీ పరిధిలో మరియు గ్రామ స్థాయిలో  సానిటేషన్ చేయించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.  ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే  కోవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకొవాలని అన్నారు. పాజిటివ్ కేసులు ఉంటే హెల్త్ స్టేటస్ చెక్ చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని అన్నారు. కార్యాలయాల్లో సిబ్బంది అందరు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలని, కరోనా నియమాలను  పాటించాలని అధికారులకు ఆదేశించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని, రెండవ డోస్ తీసుకొని 6 నెలలు దాటిన వారందరు  తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకునేలా వారికి సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

సమావేశం లో జిల్లా ఆడిట్ అధికారి భీమ్లా నాయక్, జెడ్పిసిఈఓ విజయ నాయక్, సి.పి.ఓ లక్ష్మణ్ , జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డి.ఎల్.పి.ఓ వెంకట్ రెడ్డి, గ్రంథాలయ సెక్రటరీ ప్రతాప్,  గద్వాల్ మున్సిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, అలంపుర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపల్ కమీషనర్లు, ఆడిట్ సిబ్బంది నరేందర్ రెడ్డి, వెంకట్రాములు, ఎంపిడిఓ లు, ఎంపిఓలు, తదితరులు  పాల్గొన్నారు.

———————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల్  గారి చే  జారీ చేయనైనది.

Share This Post