జిల్లాలో సజావుగా దాన్యం కోనుగోలు :: జిల్లా కలెక్జర్ జి. రవి

పత్రికాప్రకటన

జిల్లాలో సజావుగా దాన్యం కోనుగోలు :: జిల్లా కలెక్జర్ జి. రవి

తేదిః 05-12-2021
జిల్లాలో సజావుగా దాన్యం కోనుగోలు :: జిల్లా కలెక్జర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 05: జిల్లాలో వానాకాలం పంట సీజన్ 2021-22 యొక్క దాన్యం కోనుగోళు, ట్యాబ్ ఎంట్రి, దాన్యం తరలింపుతో పాటు, దాన్యాన్ని అమ్మిన రైతుకు చెల్లింపులో సైతం ఎటువంటి సమస్యలకు తావులేకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. ఈ వానాకాలంలో జిల్లాలో 2లక్షల 86వేల 357 ఎకరాలలో వరిని సాగుచేయగా 5 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం వస్తుందని అధికారుల అంచనా వేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గతవానాకాలంలో 30 వేల 415 మంది రైతుల నుండి 1లక్షా 91 వేయి 125 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ వానాకాలం సీజన్ 2021-22 లో ఐకేపి, పిఏసిఎస్ మరియు ఎయంసి లద్వారా 410 కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు ఏ గ్రేడ్‌ రకానికి రూ.1960, బీ గ్రేడ్‌ రకానికి రూ.1940 లతో 30వేల 415 మంది రైతుల నుండి తేమ, తాలు తప్ప లను వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా దృవీకరించిన 374.39 కోట్ల విలువగల లక్షా 91 వేయి 017.820 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి, 228.38 కోట్ల విలువ గల లక్షా 16 వేల 522 మెట్రిక్ టన్నుల దాన్యం ట్యాబ్ ఏంట్రి పూర్తిచేయడంతో పాటు, లక్షా73 వేల 616 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని మిల్లులకు తరలించి, సిఎస్సి ల ద్వారా నేరుగా అన్ లైన్ ద్వారా రైతులకు 165.56 కోట్లు దాదాపు 97% చెల్లింపులు జరిగేలా చేయడం జరిగిందని పేర్కోన్నారు.
జిల్లాలో కొన్ని కొనుగోలు కేంద్రాలు మరియు రైస్ మిల్లర్లు తాలు, తప్ప, తేమ శాతం లేదని దాన్యం నూకశాతం ఉందన్న తదితర కారణాలను చూపుతూ ప్రతి బస్తాకు 40 కిలోలు 650 గన్నీ బరువుకు మించి 41, 42, 43 కిలోలు తూకం వేయడానికి రైతులపై ఓత్తిడి తెస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా నాణ్యత ప్రమాణాలను ధృవీకరించిన తరువాతే దాన్యాన్ని కోనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి, తూకంలో ప్రభుత్వ ఆదేశాలకు మీరి ప్రవర్తించినట్లయితే బాద్యులపై చట్టరిత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని చోట్ల వ్యవసాయ శాఖ అధికారులు నాణ్యత ధృవీకరించని ధాన్యం కూడా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు రవాణా చేసిననట్లు గుర్తించడం జరిగిందని, నాణ్యత ప్రమాణాలను పాటించనట్లుగా గుర్తించిన 18 మండలాల్లోని 18 సెంటర్లలలో తనిఖీలు నిర్వహించి 3రోజుల లోగా నివేధికలను అందించాల్సిందిగా 5 గురు పౌరసరఫరా క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించడం జరిగిందని తెలిపారు. సెంటర్ల వారిగా శనివారం వరకు మిల్లుల వారిగా ప్రగతిని పరిశీలించగా కొడిమ్యాల, మెడిపల్లి, వెల్గటూర్, ధర్మపురి, గొల్లపల్లి మరియు కోరుట్ల మండలాల్లోని 32 మిల్లులు దాన్యం దిగుమతిలో వెనకబడి ఉన్నందున వారికి నోటీసులను జారి చేస్తూ దిగుమతిని వేగవంతం చేయనట్లయితే తెలంగాణా కస్టం మిల్లింగ్ యాక్ట్ 2015 ప్రకారం తగు చర్యలు తీసుకోబడుతుందని ఆదేశించనైనది.
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని, తాలు, తప్ప లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొని రావాలని, కోనుగోలులో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వానాకాలం పంట పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని, అదేవిధంగా కోనుగోలు కేంద్రాల వద్దనైనా లేదా మిల్లుల వద్ద ఏవరైన సమస్యలు సృష్టించిన, ఇబ్బందులకు గురిచేసిన, దాన్యం విషయంలో మీకు ఉన్న సందేహలను నివృత్తి చేసుకోవడానికి ప్యాడి కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post