జిల్లాలో సిఎస్ఆర్ నిధుల పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి …….జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

జిల్లాలో సిఎస్ఆర్ నిధుల పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి
…….జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

జిల్లాలోని పరిశ్రమలు
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సి.ఎస్.ఆర్.నిధులు అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సి ఎస్ ఆర్ నిధుల పర్యవేక్షణ కమిటీ అధికారులకు సూచించారు.

శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో
సి ఎస్ ఆర్ నిధుల పర్యవేక్షణా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.క్లస్టర్ వారీగా నివేదికలు, ఆయా అధికారులు చేపట్టిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు కంపెనీస్ యాక్ట్ మేరకు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ కింద వివిధ అభివృద్ధి పనులకు నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేయాలన్నారు.

సి.ఎస్.ఆర్. నిధులను రాబట్టడానికి,మరియు పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలోని అధికారులు వారికి కేటాయించిన క్లస్టర్ లోని పరిశ్రమలన్నింటిని మరో మారు పరిశీలించి,ఆయా పరిశ్రమల నుండి సిఎస్ఆర్ వివరాలను సేకరించి నివేదిక అంద చేయాలని సూచించారు.కరెక్ట్ డాటా తీసుకోవాలన్నారు.

కంపెనీ యాక్ట్ నిబంధన మేరకు ఉన్నది లేనిది క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీలకు సిఎస్ఆర్ గైడ్లైన్స్,ఆక్ట్ మేరకు నోటీసులు జారీ చేయాలని సూచించారు.

ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి,
సి పి. ఓ., కమిటీలోని ఆయా శాఖల అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.

Share This Post