జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి మూలాలను కనుగొని తదనుగుణంగా నియంత్రణ చర్యలతో వ్యాప్తిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 17 ఖమ్మం:

జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి మూలాలను కనుగొని తదనుగుణంగా నియంత్రణ చర్యలతో వ్యాప్తిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను కలెక్టర్ తణిఖీ చేసారు. ఓ.పి బ్లాక్, ఐ.సి.యు, టి.హబ్ ఆన్లైన్ విభాగం, ఫీవర్ వార్డ్, ఎ ఎమ్.సి వార్డు, సర్జికల్ వార్డులను కలెక్టర్ తణిఖీ చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బల్లేపల్లికు చెందిన సుహాసిని, చంద్రుగొండకు చెందిన శ్రావ్య డెంగ్యూ జ్వరంతో అడ్మిట్ అయిన నేపథ్యంలో వారియొక్క కేసు షీట్లను కలెక్టర్ తణిఖీ చేసి అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో పేషెంట్లతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యసేవలపై జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు చేసారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసుల పట్ల ప్రోగ్రాం అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించాలని, సీజనల్ వ్యాధులు ప్రభలడానికి మూల కారణాలను పేషెంట్లతో ముఖాముఖి ద్వారా తెలుసుకొని క్షేత్రస్థాయిలోని వైద్యాధికారులు, ఏ.ఎన్.ఎమ్ు, ఆశా వర్కర్ల ద్వారా నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఆసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణ పరీక్షకు సంబంధించిన ఎలిసా టెస్ట్ రిపోర్టులను 12 గంటల లోపు అందించాలని, తద్వారా వైద్యసేవలలో జాప్యం జరగదని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలని, సీజెరీయన్ శాతాన్ని పూర్తిగా తగ్గించాలని కలెక్టర్ ఆదేశించారు. పి.హెచ్, సిలలో నెలవారీ చెక్అప్లు తీసుకుంటున్న గర్భిణీలను ప్రత్యేక షెడ్యూల్డు ప్రకారం 102 వాహనం ద్వారా జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యాధికారులు సమయపాలన పాటిస్తూ ఓ.పి విభాగాల పేషెంట్లతో పాటు ఇన్ పేషెంట్లకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి వెంకటేశ్వర్లు, ఆర్.ఎం.ఓ. బి. శ్రీనివాసరావు, జనరల్ ఫిజీషియన్లు డా॥ నాగేశ్వరరావు, డా॥ రాంప్రసాద్, గైనకాలజిస్ట్ డా॥కృపా ఉపశ్రీ సంబంధిత విభాగాల సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post