జిల్లాలో సెంట్రల్ సెక్టార్ స్కీం కింద పది వేల మంది రైతులను గుర్తించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

          పత్రికా ప్రకటన                                                                   తేది: 30-08-20 21

          జిల్లాలో సెంట్రల్ సెక్టార్ స్కీం కింద పది వేల మంది రైతులను గుర్తించుటకు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

          సోమ వారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు   నాబార్డ్ ,ఎస్ బి ఐ అధికారులతో ఏర్పాటు చేసిన డి ఎం సి సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రబుత్వం  సెంట్రల్ సెక్టార్ స్కీం కింద 10 వేల మంది రైతు ఉత్పతి దారుల సంఘాలను ఏర్పాటు చేయాలనీ, జిల్లలో ప్రాతిపదికన ప్రత్యెక పంటలను ఎంపిక చేసి ఆ పంటలు పండించే రైతులని మొదటి ప్రాదాన్యతగా సమీకరించి రిజిస్టర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి క్లస్టర్ లో ముగ్గురు ఎక్స్పోర్ట్ లను ఏర్పాటు చేయాలనీ.  రైతు వేదికలో మీటింగ్ కాండక్ట్ చేసి రైతులకు స్కీం పై అవగాహన కలిగించాలని, దీనికి సంబంధించి షెడ్యూల్ తయారు చేయాలనీ . వ్యవసాయ అధికారులు, ఉద్యాన వన శాఖ అధికారులు  మండలాలు, గ్రామాలలో ఉండే రైతులను మోబిలైజ్ చేసి ఈ స్కీం లో ఉండే బెనిఫిట్స్ ను వివరించి  యూనిట్స్ పెట్ట్టే విదంగా రైతులకు అవగాహన కలిపించాలని అన్నారు

సమావేశంలో  నాబార్డ్ డి డి ఎం శ్రీనివాస్,ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ అధికారి హైదరాబాద్ ప్రభంజన్, డి ఆర్ డి ఓ ఉమా దేవి, వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, వెటర్నరీ అధికారి వెంకటేశ్వర్లు, ఎల్ డి ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————–   

  జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ జారి చేయబడినది

Share This Post