జిల్లాలో సెప్టెంబర్, 16 నుండి ప్రారంభించి ఇండ్లవద్దకే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న ట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సుధాకర్ లాల్ నేడోక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో సెప్టెంబర్, 16 నుండి ప్రారంభించి ఇండ్లవద్దకే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న ట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సుధాకర్ లాల్ నేడోక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడంతో ఇప్పటి వరకు జిల్లాలో 59 గ్రామాలు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన గ్రామలుగా నిలిచాయని తెలియజేసారు. నిన్నటి వరకు 34 గ్రామాలు వంద శాతం పూర్తి చేసుకోగా నేడు ఒక్క రోజే 25 గ్రామాలు వంద శాతం పూర్తి చేసిన జాబితాలో చేరినట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 5,41,854 మంది 18 సంవత్సరాలు నిండిన వారు వ్యాక్సిన్ కు అర్హులు కాగా నేటి సాయంత్రం వరకు మొత్తం 3,88,530 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 254 బృందాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనగా సాయంత్రం వరకు 12650 మందికి ఈ ఒక్క రోజులో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని తెలియజేసారు. మొత్తం మీద జిల్లాలో నేటితో 71 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు గణాంకాలు తెలితజేశారు

Share This Post