జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల ప్రక్రియలో 94.43 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయపు పోలింగ్ కేంద్రం పరిధిలో 84 ఓటర్లకు 79 మంది ఓటర్లుతో 94.05 శాతం, అలాగే ఆర్డీఓ కార్యాలయం, కొత్తగూడెంలో 221 మంది ఓటర్లకు 209 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోగా 94.57 శాతం పోలింగ్ జరిగినట్లు ఆయన వివరించారు. మొత్తం 305 మంది ఓటర్లుకు గాను 288 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోగా 94. 43 శాతం నమోదయినట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిర్వహించుటలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి సహకరించిన జిల్లా ప్రజలకు ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికార యంత్రాంగాన్ని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటలో శాంతి బత్రలు పర్యవేక్షణ చేసిన పోలింగ్ యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తదుపరి మెటీరియల్ను ఖమ్మంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముకు ఇద్దరు సెక్టోరియల్  అధికారులు, పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బందితో పాటు పటిష్ట పోలీస్ బద్రతతో తరలించినట్లు ఆయన తెలిపారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం ద్వారా

Share This Post